ఆమనగల్లులో ‘కింగ్’ ఎవరు?

by velandi.Saikiran |   (  Updated:2026-02-11 21:01:00  IST  )

2020 మున్సిపాలిటీ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలు కైవసం చేసుకున్న బీఆర్ఎస్, మంగళవారం జరిగిన ఎన్ని కల్లో మెజారిటీ సీట్లు సాధిస్తుందని ఓట ర్లు బహిరంగంగా పేర్కొంటున్నారు.

ఆమనగల్లులో ‘కింగ్’ ఎవరు?
X

దిశ, ఆమనగల్లు : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆమనగల్లు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిం దా? గత పాలకవర్గం బీజేపీ ఓటు బ్యాంకు తగ్గినట్లేనా? 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఒక సీటు గెలవని కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో స్వల్ప సంఖ్యలో కౌన్సిల్ సభ్యులను గెలుచుకోనుందా?? మంగళవారం సాయంత్రం ఓటర్లు బ హిరంగంగా చర్చించుకున్న మాటలివి.

పుంజుకున్న బీఆర్ఎస్ ఓటు బ్యాంకు

2020 మున్సిపాలిటీ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలు కైవసం చేసుకున్న బీఆర్ఎస్, మంగళవారం జరిగిన ఎన్ని కల్లో మెజారిటీ సీట్లు సాధిస్తుందని ఓట ర్లు బహిరంగంగా పేర్కొంటున్నారు. పోలింగ్‌కు మూడు రోజుల ముందు నుంచి ఓటు బ్యాంకు బీఆర్ఎస్ వైపు మళ్లిందని చర్చించుకుంటున్నారు. 15 వార్డుల్లో 2,3,4,5,6,8,12,13 వార్డుల ను బీఆర్ఎస్ అభ్యర్థులు చేజిక్కించుకుంటున్నారని బహిరంగంగానే పేర్కొంటున్నారు.

తగ్గనున్న బీజేపీ స్థానాలు..

2020లో జరిగిన మున్సిపాలిటీ ఎన్ని కల్లో మెజారిటీ స్థానాలు సాధించిన బీజేపీ, ఈ ఎన్నికల్లో ఆ స్థానాలు తగ్గను న్నట్లు ఓటర్లు పేర్కొంటున్నారు. 1, 3, 10, 14వ వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు గెలవనున్నారని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు.

మరో‌సారి కాంగ్రెస్‌కు భంగపాటేనా?

2020ఎన్నికల్లో ఒక స్థానం సైతం గెల వని కాంగ్రెస్, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఆమనగల్లు ము న్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో లోపా లు ఉన్నట్లు సొంత కార్యకర్తలే పేర్కొంటున్నారు. మున్సిపాలిటీలో 7,9,15స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవనున్నట్లు ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.

ఫలితాలపై ఉత్కంఠ..

మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, అనంతరం సాధారణ బ్యాలెట్ పేపర్ లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపుపై మున్సిపాలిటీ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.

Next Story