మాజీ సర్పంచ్ ను పరామర్శించిన స్పీకర్ గడ్డం ప్రసాద్

by velandi.Saikiran |

మర్ పల్లి మండలం కల్ కోడా మాజీ సర్పంచ్ రాచన్నను శాసన సభాపతి గడ్డం ప్రసాద్ బుధవారం పరామర్శించారు. గత మూడు

మాజీ సర్పంచ్  ను పరామర్శించిన స్పీకర్ గడ్డం ప్రసాద్
X

దిశ, శంకరపల్లి: మర్ పల్లి మండలం కల్ కోడా మాజీ సర్పంచ్ రాచన్నను శాసన సభాపతి గడ్డం ప్రసాద్ బుధవారం పరామర్శించారు. గత మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై శంకర్పల్లిలోని గాయత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయనను స్పీకర్ ప్రసాద్ కుమార్ పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్య పరీక్షలపై డాక్టర్లతో ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్టు తెలిపారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు యు రవీందర్, మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఎం ఏ సలీం, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్ తదితరులున్నారు.

Next Story