చట్టం ఎవరికీ చుట్టం కాదు.. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

by Disha Web |
చట్టం ఎవరికీ చుట్టం కాదు.. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
X

దిశ, దోమ : చట్టాన్ని ఎవరు అతిక్రమించి చేతుల్లోకి తీసుకోవాలని అనుకున్నా వారిపై కఠినంగా వ్యవహరిస్తామని దోమ ఎస్సై విశ్వజన్ హెచ్చరించారు. మండల పరిధిలోని మోత్కూరు గ్రామానికి చెందిన 25 మందిపై కేసు నమోదు చేయగా శుక్రవారం 11 మందిని రిమాండ్ కు తరలించారు. ఎస్సై విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం గత నెల సెప్టెంబర్ 21న మోత్కూరు గ్రామానికి చెందిన నందిని అనే విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన సోహెల్ బైక్ పై నందిని ఢీకొట్టాడని, సోహెల్ ఇంటిముందు మృతదేహం పెట్టి న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడుతామని గ్రామానికి చెందిన కొందరు యువకులు మృతదేహం వద్ద ఆందోళన చేపట్టారు.

ఈ క్రమంలో పోలీసులు వారిని ఎంత వారించినా వినకుండా, పోలీసుల విధులకు ఆటంకం కల్గించడమే కాకుండా, మృతదేహం తీసుకువచ్చే వాహనం డోర్ విరగొట్టి మృతదేహాన్ని తీసుకెళ్లి బాధితుడు సోహెల్ ఇంటి ముందు బైటాయించేందుకు యత్నించారు. ఈ క్రమంలో మృతదేహాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ఎంత వారించినా వినలేదు. ఈ సంఘటనకు పాల్పడిన 25 మందిని గుర్తించి కేసులు నమోదు చేశామని, అందులో భాగంగా శుక్రవారం 11 మందిని రిమాండ్ చేస్తున్నామని, చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్సై విశ్వజన్ తెలిపారు.


Next Story

Most Viewed