స‌ర్పంచ్, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శికి షోకాజ్ నోటీసులు

by Ratna Kumari |

చెత్త దహనం, నిర్లక్ష్యంపై జిల్లా పంచాయతీ అధికారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్ కి షోకాజు నోటీసులు జారీ చేశారు.

స‌ర్పంచ్, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శికి షోకాజ్ నోటీసులు
X

దిశ, శంషాబాద్ : చెత్త దహనం, నిర్లక్ష్యంపై జిల్లా పంచాయతీ అధికారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్ కి షోకాజు నోటీసులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ బుధవారం శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ గ్రామ పంచాయితీని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలు లోపాలను గుర్తించారు. గ్రామంలోని కంపోస్ట్ యార్డులో ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను శాస్త్రీయ విధానంలో నిర్వహించకుండా కాల్చి వేస్తున్నట్లు ఆయన గుర్తించారు. అలాగే వైకుంఠ ధామంలోని బోర్ మోటార్ నీరు నిరంతరంగా నడిచి వృథాగా ప్రవహిస్తుండటం, నర్సరీలో మొక్కలు సరిగా పెంచకపోవడం వంటి అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పంచాయితీ కార్యదర్శి జ్యోత్స్న‌, పూర్తి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించినట్లు భావించిన జిల్లా అధికారి ఆమెతో పాటు సర్పంచ్ సుభాష్ కు సైతం షోకాజ్ నోటీసు జారీ చేశారు. రెండు రోజుల్లోపు అన్ని లోపాలను సరి చేయాలని ఆదేశించారు. మండల పంచాయతీ అధికారికి కూడా నోటీసులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ పరిపాలనలో నిర్లక్ష్యం సహించబోమని, ప్రజా వనరుల సంరక్షణతో పాటు పారిశుద్ధ్య నిర్వహణలో బాధ్యులు కట్టుదిట్టంగా వ్యవహరించాలని జిల్లా అధికారి సురేష్ మోహన్ స్పష్టం చేశారు.

Next Story