- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తమ పట్టు పరిశ్రమ రైతుగా శక్రునాయక్
తెలంగాణ రాష్ట్రం నుండి ఒకే ఒక్కడు ఎంపిక - 20 రాష్ట్రాల నుంచి ఉత్తమ రైతుల ఎంపిక.. బెంగళూరులోని జీకేవీకే క్యాంపస్ లో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం

ఉత్తమ పట్టు పరిశ్రమ రైతుగా శక్రునాయక్
- తెలంగాణ రాష్ట్రం నుండి ఒకే ఒక్కడు ఎంపిక
- 20 రాష్ట్రాల నుంచి ఉత్తమ రైతుల ఎంపిక
- బెంగళూరులోని జీకేవీకే క్యాంపస్ లో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
దిశ, తలకొండపల్లి : భారతదేశంలోని 20 రాష్ట్రాల నుండి ఉత్తమ రైతులను గుర్తించి జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ రైతులను ఎంపిక చేశారు. శనివారం బెంగళూరులోని జీకేవికే క్యాంపస్ లో నిర్వహించిన 76 వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి సెంట్రల్ సిల్క్ బోర్డు మెంబర్స్ అయినా కర్ణాటక రాష్ట్రంలోని చిలక బల్లాపూర్ ఎంపీ డాక్టర్ సుధాకర్, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ కు చెందిన ఎంపీ లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ న్యూఢిల్లీకి చెందిన పద్మిని సిమ్లా ఐఏఎస్, బోర్డ్ ఆఫ్ మెంబర్ సెక్రటరీ పి. శివకుమార్, డాక్టర్ నరేష్ బాబు సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై ఉత్తమ రైతులకు వారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను మెమొంటోలను అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా సెంట్రల్ సిల్క్ బోర్డ్ మెంబర్స్, ఆయా రాష్ట్రాల ఎంపీలు మాట్లాడుతూ భారత దేశంలోని కేవలం 20 మంది ఉత్తమ రైతులుగా ఎంపిక కావడం గర్వించదగ్గ విషయమని వారు అన్నారు. ప్రతి వ్యక్తి సమాజంలో తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి డాక్టర్లు, ఇంజనీర్లు కావలసిన అవసరం లేదని, మనం చేసే పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించి దేశ స్థాయిలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం అంటే వారి కష్టానికి పడ్డ ఫలితమే వారిని నేడు ఈ వేదిక వద్దకు తీసుకురావడానికి ఎంతగానో కృషి చేసి ఉంటారని గుర్తు చేశారు. ప్రతి మనిషి చేసే పనిలో పట్టుదల ఓర్పు ఉంటే తప్ప అనుకున్న లక్ష్యం సాధించడం అంత సులువు కాదని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలంలోని కోరింతకుంట తండాకు చెందిన ఒక గిరిజన రైతు శక్రు నాయక్ సొంత గ్రామంలోనే ఉంటూ తాను చేసే పనిలో నైపుణ్యం ప్రదర్శిస్తూ రాష్ట్రం నుంచి ఉత్తమ రైతుగా ఎంపికయ్యారు. కార్యక్రమంలో జైంట్ డైరెక్టర్ లత, డాక్టర్ వినోద్ కుమార్ యాదవ్, రాఘవేందర్, ఆయా రాష్ట్రాలకు చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు.






