- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా కల్తీ నిత్యవసర వస్తువుల పట్టివేత
నకిలీ కిరాణా వస్తువుల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసుల దాడులు నిర్వహించారు.

దిశ, శంషాబాద్ : నకిలీ కిరాణా వస్తువుల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసుల దాడులు నిర్వహించారు. పక్క సమాచారంతో మంగళవారం రాత్రి రాజేంద్రనగర్ జోన్ ఎస్వోటీ పోలీసుల బృందం ఒక్కసారిగా దాడులు నిర్వహించి, నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 8 లక్షల విలువ చేసే నకిలీ కిరాణా వస్తువులు స్వాధీనం చేసుకున్న ఘటన మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబన్ కాలనీలో చోటుచేసుకుంది.
రాజేంద్రనగర్ ఎస్ఓటి సిఐ రమణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబన్ కాలనీలో నకిలీ కిరాణా వస్తువులు తయారు చేస్తున్నారని పక్క సమాచారం వచ్చింది. దీంతో ఎస్వోటీ పోలీసులతోపాటు మైలార్దేవుపల్లి పోలీసుల బృందం ఒక్కసారిగా నకిలీ తయారీ కేంద్రంపై దాడుల నిర్వహించామని తెలిపారు. ఈ దాడులలో ఘనోబా, ఖుషి,రీత,మనీషా నలుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని ,మరో వ్యక్తి వీరేంద్ర గహ్లట్ పరారీలో ఉన్నాడని తెలిపారు. వీరి వద్ద నుంచి నకిలీ బ్రూక్ బ్యాండ్ రెడ్ లేబుల్ టీ పౌడర్, తాజ్ మహల్ టీ పౌడర్, వీల్ సర్ఫ్, ప్యారేట్ కొబ్బరినూనె, కంఫర్ట్ కండిషనర్, క్లీనిక్ ప్లస్ హెయిర్ షాంపూ, కార్న పౌడర్, బాడీ లోషన్ లాంటి 20 రకాల కిరణా వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తం వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వాటి విలువ 8 లక్షలు ఉంటుందని అంచనా వేశామన్నారు. నిందితులను మైలార్దేవుపల్లి పోలీసులకు అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు. మైలార్దేవుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






