- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామ పంచాయతీ అభివృద్ధికి సర్పంచులు, సెక్రటరీలు కృషి చేయాలి
గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు.

దిశ, వికారాబాద్ ప్రతినిధి: గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓ, సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు మూడు సంవత్సరాల సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లోని జనాభా ప్రాథమిక ఆరోగ్య అంగన్వాడీ కేంద్రాల వివరాలను సాఫ్ట్ వేర్ లో నమోదు చేయవలసి ఉంటుంది అన్నారు. గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధికి 6 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని వీరి సూచనల మేరకు గ్రామాల అభివృద్ధి పై అవగాహన కల్పించుకోవాలని ఆయన సూచించారు. గ్రామాల్లో కుక్కల బెడదతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని జంతు జనన నియంత కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోతున్న క్రమంలో జలసిరి పథకం ద్వారా ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ప్రతి పొలానికి పంట కుంట ప్రతి ఊరిలో ఊట కుంటలను లను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు వర్షాభావ పంటలు తక్కువ నీటితో సాగు చేసే పంటలు వేసే విధంగా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి పంటల సాగుపై అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. రైతులు ఆయిల్ ఫామ్ ను సాగించేందుకు ప్రోత్సహించాలని ఈ పంటకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తుందనే విషయాన్ని రైతులకు తెలియచేయాలని కలెక్టర్ తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఉమా శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పంచాయతీ ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధుల కంటే అధికంగా ఖర్చు చేయకూడదని ఆయన సూచించారు. గ్రామాల్లో వీధి దీపాలు సమకూర్చుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీలలో విద్యుత్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వీటిని అధిగమించేందుకు సోలార్ సిస్టంను వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ వ్యర్థాలను వేరు చేసి ఇద్దాం మన గ్రామాలను స్వచ్ఛందంగా మార్చుకుందాం అనే గోడ ప్రతిని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సుధీర్ డిపిఓ జయసుధ డీఆర్డిఓ శ్రీనివాస్ అడిషనల్ డిఆర్డిఓ సత్తయ్య మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్ పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






