గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా : సర్పంచ్ తోక మురళీకృష్ణ

by Batti.Sumithra |

అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని చందానగర్ గ్రామ సర్పంచ్ తోక మురళీకృష్ణ పేర్కొన్నారు.

గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా : సర్పంచ్ తోక మురళీకృష్ణ
X

దిశ, మొయినాబాద్ : అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని చందానగర్ గ్రామ సర్పంచ్ తోక మురళీకృష్ణ పేర్కొన్నారు. ఇటీవల గ్రామపంచాయతీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులను గ్రామ రేషన్ డీలర్ ఘనంగా సన్మానించారు. ఆదివారం మొయినాబాద్ మండల పరిధిలోని చందానగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులను గ్రామ రేషన్ డీలర్ కట్ట ప్రభావతి మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ కట్ట ప్రభావతి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని తెలిపారు. అలాగే తమకు రావాల్సిన కమిషన్‌, బకాయిలు, గౌరవ వేతనం పెంచాలని సర్పంచ్‌ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

దీనికి స్పందించిన గ్రామ సర్పంచ్ తోక మురళీకృష్ణ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో రేషన్ డీలర్ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా జరిగేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కుమ్మరి రాజు, వార్డు సభ్యులు వీరేష్, చాకలి వసంత నవీన్, కుమ్మరి భాస్కర్, కిస్టాపురం మహేందర్, పగడాల ఉషా ప్రభాకర్, ఎం.డి. రైసా హాసన్, పూజారి వరలక్ష్మీ రాజు, గ్రామ మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story