- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత..
by Batti.Sumithra |
ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు.

X
దిశ, బషీరాబాద్ : ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బషీరాబాద్ మండలంలోని మైల్వార్ గ్రామానికి చెందిన దుగ్గనూరు మోహన్ రాత్రి సమయంలో మైల్వార్ వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుకను అదే గ్రామానికి తరలిస్తున్నాడని సమాచారం.
ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్రమ ఇసుక ట్రాక్టర్ ను పట్టుకొని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించి ట్రాక్టర్, యజమానిపై కేసు నమోదు చేసినట్లు విద్యాచరణ్ రెడ్డి తెలిపారు. ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా ఇసుకను తరలించినచో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
Next Story






