కొత్తూరు మున్సిపల్ కమిషనర్‌గా సాహితి రెడ్డి బాధ్యతల స్వీకరణ..

by Kodari Anjali |

కొత్తూరు మున్సిపల్ నూతన మున్సిపల్ కమిషనర్‌గా ఏ. సాహితి రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

కొత్తూరు మున్సిపల్ కమిషనర్‌గా సాహితి రెడ్డి బాధ్యతల స్వీకరణ..
X

దిశ, షాద్ నగర్: కొత్తూరు మున్సిపల్ నూతన మున్సిపల్ కమిషనర్‌గా ఏ. సాహితి రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే కమిషనర్ సాహితి రెడ్డి మున్సిపల్ అధికారులతో సమావేశమయ్యారు. మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సేవలపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. మున్సిపాలిటీలో పారిశుధ్యం మెరుగుదల, తాగునీటి సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించి పారదర్శక పరిపాలన అందిస్తామని స్పష్టం చేశారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ సాహితి రెడ్డి హామీ ఇచ్చారు.

Next Story