- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, శంకర్‌పల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం పరివేద గ్రామానికి చెందిన పాండు(25) శంకర్‌పల్లిలోని ఓ ఎలక్ట్రానిక్ షాప్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని బైక్‌పై స్వగ్రామమైన పరివేదకు వెళుతుండగా ఏర్వగూడ గేట్ వద్ద రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు పాండుకు నాలుగేళ్ల క్రితం వివాహం కాగా, ప్రస్తతం భార్య ఐదు నెలల గర్భంతో ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శంకర్‌పల్లి సీఐ మహేష్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడి పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






