బియ్యం విచారణలో కదలిక

by velandi.Saikiran |

రంగారెడ్డి జిల్లా కిస్మత్‌‌పురా గోడౌన్‌లో బియ్యం మాయమైన ఘటనపై జరుగుతున్న విచారణలో కదలిక వ చ్చింది.

బియ్యం విచారణలో కదలిక
X

బియ్యం విచారణలో కదలిక

-కిస్మత్‌‌పురా గోడౌన్‌‌లో బియ్యం మాయంపై రెండున్నరేళ్లుగా సాగుతున్న విచారణ వేగవంతం

-ఎట్టకేలకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు నోటీసులు

-ఆ సమయంలో పనిచేసిన మరికొందరికీ నోటీసులు

-నేడు అడిషనల్‌ కలెక్టర్‌ సమక్షంలో విచారణ

-స్టేట్‌ మెంట్‌ రికార్డు చేయనున్న అధికారులు

దిశ, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి జిల్లా కిస్మత్‌‌పురా గోడౌన్‌లో బియ్యం మాయమైన ఘటనపై జరుగుతున్న విచారణలో కదలిక వ చ్చింది. వివిధ ప్రాంతాల్లో పట్టుకు న్న రేషన్‌ బియ్యాన్ని ఇక్కడి గోదాం లో నిల్వ ఉంచగా.. సుమారు 495 టన్నుల బియ్యం మాయమైంది. దీనిపై రెండున్నరేళ్లుగా విచారణ సాగుతోంది. ఇప్పటి వరకు బాధ్యులెవరో తేల్చకపోవడంతోపాటు చ ర్యలు కూడా తీసుకోలేదు. విచారణలో స్తబ్ధుగా కొనసాగుతుండతో ఇటీవల ‘దిశ’ కథనం ప్రచురించిం ది. ఈ క్రమంలో అధికారుల్లో కద లిక మొదలైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులతో పాటు బియ్యం మాయమైన సందర్భంలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించిన వారందరికీ తాజాగా నోటీసు లు జారీ చేశారు. కలెక్టరేట్‌‌లో అడిషనల్‌ కలెక్టరేట్‌ సమక్షంలో 15 మంది విచారణకు హాజరుకానున్నారు. విచారణలో హాజరు కాను న్న వారిలో ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగు లు ఉన్నారు. విచారణ తర్వాత ఏం తేల్చుతారో? అన్నది సర్వత్రా ఆసక్తి గా మారింది.

నేడు విచారణ

రంగారెడ్డి కలెక్టరేట్‌‌లోని అడిషనల్‌ కలెక్టర్‌ ఛాంబర్‌లో శుక్రవారం జరగనున్న విచారణకు హాజరు కావాల్సిందిగా 15 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. బియ్యం మాయమైన సమయంలో జిల్లాలో విధులు నిర్వర్తించిన వారందరినీ విచారణకు పిలుస్తున్నారు. గతం లో ఇన్‌చార్జి డీఎస్వోగా పనిచేసిన రాథోడ్‌ (ప్రస్తుతం సివిల్‌ సప్లయ్‌ లో జాయింట్‌ కమిషనర్‌), డీఎం శ్యామారాణి (రిటైర్డ్), డీఎం విజయలక్ష్మి (రిటైర్డ్), పుల్లయ్య(ఏఎస్ వో, రంగారెడ్డి), బాల సరోజ (డీఎ స్వో, సంగారెడ్డి), నర్సింహా రావు (డీఎస్‌వో, నాగర్‌ కర్నూలు), జగన్‌ మోహన్‌ (డీఎం, వనపర్తి), శౌరీ (ఏఎం, హైదరాబాద్‌), రవీందర్‌ రాథోడ్‌ (ఏఎస్‌వో, పెద్దపల్లి), రవి నాయక్‌ (డీఎం, మహబూబ్‌ నగ ర్‌), ఎండీ మోయిన్‌ (జూరియర్‌ అసిస్టెంట్‌, డీఎస్వో కార్యాలయం), అరుంధతి (డీఈవో, కిస్మత్‌ పురా ఎంఎల్‌ఎస్ పాయింట్‌), జయచం ద్ర (డీఈవో, కిస్మత్‌ పురా ఎంఎల్‌ ఎస్ పాయింట్‌), నగేష్‌ (వాచ్‌ మె న్‌, కిస్మత్‌ పురా ఎంఎల్‌ఎస్ పా యింట్‌), హమాలీ మేస్త్రీలు హాజ రు కానున్నారు. కొంత మంది చే సిన తప్పులకు సమాధానం చెప్పేం దుకు ఉన్నత స్థాయి ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులతో విచారణకు హాజరు కావాల్సి వస్తోంది. మాయమైన బి య్యం విలువ రూ.కోటి వరకు ఉం డగా.. ప్రస్తుతం గోడౌన్‌‌లో నిల్వ ఉంచిన మిగతా బియ్యం ముక్క పట్టినట్లు తెలుస్తోంది. దీని విలువ ఎంత లేదన్నా రూ.కోటి వరకు ఉండనున్నట్లు తెలిసింది. పెద్ద మొ త్తంలో బియ్యం మాయమైనప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తుండడంపై సివిల్‌ సప్లయ్‌ శాఖ ఉన్నతాధికారుల తీరు పై ఎంతో కాలంగా విమర్శలు వ చ్చాయి. ఏదిఏమైనా ఇంతకాలం తర్వాత ఏకంగా 15 మందిని విచారణకు పిలిచి వారి స్టేట్‌మెంట్‌‌ను రికార్డు చేయనుండడంతో ఉన్నతాధికారులు తీసుకోబోయే నిర్ణయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అసలేం జరిగిందంటే

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బి య్యాన్ని పట్టుకున్న అధికారులు రంగారెడ్డి జిల్లా, కిస్మత్‌‌పురా (ఎంఎల్‌ఎస్ పాయింట్‌)లోని గోడౌన్‌‌లో భద్రపరుస్తూ వస్తున్నా రు. ఎంతో కాలంగా కొనసాగుతుండగా.. 2022, డిసెంబరులో ఉన్నతాధికారులు జరిపిన తనిఖీ ల్లో బియ్యంలో శాటేజీ ఉన్నట్లు తేలింది. పెద్ద ఎత్తున బియ్యం మాయమైనట్లు గ్రహించిన అధికారులు కమిషన్ల మీద కమిషన్లు వేసి విచారణ చేశారు. రెండున్నరేళ్లుగా ఈ తంతు సాగినప్పటికీ అక్రమాలను తేల్చలేకపోయారు. గోదాంలో సుమారుగా 900 ట న్నుల వరకు బియ్యం నిల్వ ఉండ గా.. అందులో 495 టన్నులు మాయమైనట్లు అధికారులు ఆల స్యంగా గుర్తించినా.. బాధ్యులపై చర్యలు లేవు. పక్కదారి పట్టిన బియ్యం విలువ ఎంత లేదన్నా రూ. కోటి వరకు ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడ పనిచేసిన డీటీ, ఏఎస్వోల డైరెక్షన్‌‌లోనే బి య్యం పక్కదారి పట్టినట్లు ఆరోప ణలున్నాయి. విచారణలో జరుగుతున్న జాప్యంపై ‘దిశ’ కథనా న్ని ప్రచురించింది. రెవెన్యూ అద నపు కలెక్టర్‌ చంద్రారెడ్డి కిస్మత్‌‌పు రా గోడౌన్‌‌ను సందర్శించారు. 15మందికి నోటీసులిచ్చారు.

Next Story