ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా పెంపొందించాలని మంత్రికి వినతి..

by Disha Web Desk 20 |
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా పెంపొందించాలని మంత్రికి వినతి..
X

దిశ, బడంగ్​పేట్​ : జల్ పల్లి మున్సిపాలిటీలోని శ్రీరాం కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలగా పెంపొందించాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి జల్​పల్లి కౌన్సిలర్లు కె.లక్ష్మీనారాయణ, పల్లపుశంకర్​లు ఓ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు అందజేసిన విజ్ఞాపన పత్రంలో జల్ పల్లి మున్సిపాలిటీలోని శ్రీరాం కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 5వ తరగతి వరకు మాత్రమే ఉందని వివరించారు. 5వ తరగతి అనంతరం స్థానిక విద్యార్థులు ఉన్నత చదువుల నిమిత్తం సుధూర ప్రాంతాలకు వెళ్లాళ్సి వస్తుందని, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్న నేపధ్యంలో ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలగా పెంపొందించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed