బీసీలు అన్ని రంగాల్లో రాణించాలి : రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య

by Batti.Sumithra |

బీసీలు అన్ని రంగాల్లో రాణించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు.

బీసీలు అన్ని రంగాల్లో రాణించాలి : రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
X

దిశ, కడ్తాల్ : బీసీలు అన్ని రంగాల్లో రాణించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఆదివారం కడ్తాల్ మండల కేంద్రంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సందర్భంగా తెలంగాణ యువజన సంఘం ఐక్యవేదిక, వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృతజ్ఞత ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా బీసీల కోసం ఉద్యమిస్తున్నానని, ఉద్యమాలతో సమస్యలు పరిష్కారమయ్యాయని, బీసీ కులాల్లోని యువతకు చదువుతూనే మంచి గుర్తింపు లభిస్తుందని పేద విద్యార్థుల చదువు కోసం బీసీ సంఘం అండగా ఉంటుందని, సంవత్సరాలు తరబడి బీసీలను అన్ని రంగాల్లో మోసం చేస్తున్నారని, రాబోయే రోజులో బీసీలను గెలిపించుకోవాలని రాజకీయ నాయకులు ఓటర్లకు మాత్రమే భయపడతారని కావున బీసీలు అంత ఏకమై బీసీల అభ్యున్నతి కోసం కృషి చేయాలని కోరారు.

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరగడానికి కారణం రెడ్డిలే అని, బీసీల ఓట్లను కొంటరు రెడ్లు ఓట్లు అమ్ముకోరని దాన్ని మనం గ్రహించాలని పిడికెడు మంది ఉండరు కానీ బీసీలకు రావాల్సిన వాటాను కాజేస్తారని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఇచ్చిన ఓటు హక్కును మనమే వేసుకుంటే మన పై ఎవరు పెత్తనం చెలాయించలేరని, రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీల సత్తా చాటాలన్నారు. రాఘవేందర్ ఒక నిబద్ధత కలిగిన నాయకుడని, గెలిచి అవతలపడే నాయకుడు కాదని ప్రజాసేవ కోసం ముందుండి కొట్లాడే నాయకుడని కావున ఇలాంటి నాయకుడిని గుర్తించాల్సిన బాధ్యత బీసీలందరూ తీసుకోవాలని బీసీల పక్షాన పోరాటం చేసేందుకు కృషి చేయాలన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో రెడ్లు చేసిన అన్యాయానికి బీసీలు బలవుతున్నారని రానున్న రోజుల్లో కచ్చితంగా బీసీ జెండానే ఎగురుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు భరత్ కుమార్, రాజ్యాధికార పార్టీ నాయకులు హరిశంకర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ యువజన సంఘం ఐక్యవేదిక అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల రాఘవేందర్, నాయకులు, యువజన, కుల సంఘాల నాయకులు, వార్డు సభ్యులు, మహిళలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Next Story