రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకటరెడ్డికి ప్రమోషన్

by Taduka Kalyani |

రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) వెంకటరెడ్డికి పదోన్నతి లభించింది.

రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకటరెడ్డికి ప్రమోషన్
X

దిశ, గండిపేట: రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) వెంకటరెడ్డికి పదోన్నతి లభించింది. డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం అదనపు కలెక్టర్ గా పదోన్నతి కల్పిస్తూ పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్‌(రెవెన్యూ)గా నియమించింది. ప్రమోషన్‌తో పాటు ఆయనను రాజేంద్రనగర్ నుంచి పెద్దపల్లికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజేంద్రనగర్ ఆర్డీవోగా పనిచేసిన వెంకటరెడ్డి తన విధుల్లో సమర్థవంతంగా పనిచేసి మంచి గుర్తింపు పొందారు. ఆయనకు పదోన్నతి రావడంతో అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు.

Next Story