- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలి : ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి
విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష

నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలి : ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి
విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష
దిశ, పరిగి : వ్యవసాయానికి, ఇంటి అవసరాలకు పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో శనివారం రాత్రి విద్యుత్ శాఖ సీఈ బాలస్వామి, ఏడి నాయుడు తదితర అధికారులతో పరిగి ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు టి.రామ్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు అందిస్తున్న విద్యుత్ సరఫరా, గృహాలకు అందుతున్న ఉచిత విద్యుత్, తదితర అంశాలపై చర్చించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయాలని, గృహాలకు అందుతున్న ఉచిత విద్యుత్ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిగి నియోజకవర్గానికి విద్యుత్ శాఖ నుండి కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, కొత్త లైన్ల తదితర అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.60 కోట్లు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి తెలియజేశారు. అదనంగా, మరో రూ.10 కోట్ల రూపాయల ప్రపోసల్స్ ప్రభుత్వానికి సమర్పించబడినట్లు, అవి త్వరలో మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేస్తామని తెలియజేశారు .






