- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి..
మొయినాబాద్ మున్సిపాలిటీలోని 26వార్డుల కౌన్సిలర్ పదవి ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

దిశ,మొయినాబాద్: మొయినాబాద్ మున్సిపాలిటీలోని 26వార్డుల కౌన్సిలర్ పదవి ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సామాగ్రిని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు పోలీసు భద్రత నడుమ మంగళవారం సిబ్బందిని తరలించారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మూర్తుజాగూడ రెవెన్యూ పరిధిలోని మాక్ కళాశాల ఆవరణలో మొయినాబాద్ మున్సిపాలిటీ వార్డుల కౌన్సిలర్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి సందర్శించి.. ఎన్నికల సిబ్బందికి పలు ప్రత్యేక సలహాలు సూచనలు ఇచ్చారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా మొత్తం సిబ్బందికి విధులను జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎంఈఓ మల్లయ్య, మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ లు కేటాయించారు. మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ మాట్లాడుతూ..ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మొయినాబాద్ మున్సిపాలిటీలోని 52 పోలింగ్ కేంద్రాల్లో 16,417 పురుషులు.. 16,454 మహిళలు.. మొత్తం 32,871 మంది ఓటర్లు ఉన్నారని, 26 మున్సిపాలిటీ వార్డులలో కౌన్సిలర్ అభ్యర్ధులు 108 మంది బరిలో ఉన్నారని, కమిషనర్ జాకీర్ అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, ఎంఈఓ మల్లయ్య, ఎన్నికలకు సంబంధిత అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.






