- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లల దృష్టిలోపం విముక్తి కోసం పోస్టర్ విడుదల
అత్తాపూర్ డివిజన్ పరిధిలోని హైదర్‌గూడ గాంధీభవన్‌లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దిశ, రాజేంద్రనగర్ : అత్తాపూర్ డివిజన్ పరిధిలోని హైదర్‌గూడ గాంధీభవన్‌లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డెక్కన్ విజన్ ఐకేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో జర్మన్ టెన్ హాస్పిటల్, సుశీలా నేత్రాలయ, మెడికవర్, న్యూ హోప్ ఇయర్ రింగ్ సొల్యూషన్, క్లోవ్ డెంటల్‌కు చెందిన వైద్య సిబ్బంది పాల్గొని ఉచిత వైద్య సేవలు అందించారు.
ఈ సందర్భంగా ప్రజలకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు దృష్టిలోపం సమస్యల నుంచి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో అవగాహన కల్పిస్తూ వైద్యులు, స్థానిక ప్రముఖులు ప్రత్యేక పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డెక్కన్ విజన్ ఐ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ సుఫియా, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు మొండ్ర కొమురయ్య, నల్లింగ్ రమేష్, సులిగె వెంకటేష్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సులిగె మహేందర్, మేడం మధుసూదన్, సహదేవ రెడ్డి, ఎస్‌బీ హరినాథ్, కమలకర్ రాజు, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.






