పేకాట స్థావరంపై పోలీసుల దాడులు.. 12 మంది అరెస్ట్

by Kodari Anjali |

డైమండ్ సిటీ కాలనీలోని పేకాట స్థావరంపై అత్తాపూర్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు.

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు.. 12 మంది అరెస్ట్
X

దిశ, రాజేంద్రనగర్: డైమండ్ సిటీ కాలనీలోని పేకాట స్థావరంపై అత్తాపూర్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూదరుల నుంచి రూ.43 వేల నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై జూద నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే అక్రమ జూద కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత పేకాట, డ్రగ్స్‌ వంటి దురాగాతాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Next Story