మ‌హిళ‌ల ఆశీర్వాదంతో ప్ర‌జా ప్ర‌భుత్వ పాల‌న

by Ratna Kumari |

మహిళల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే అన్నారు.

మ‌హిళ‌ల ఆశీర్వాదంతో ప్ర‌జా ప్ర‌భుత్వ పాల‌న
X

దిశ, షాద్ నగర్ : మహిళల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే అన్నారు. మహాలక్ష్మి పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 290 కోట్ల మహిళా ప్రయాణికులకు రూ. 10వేల కోట్ల ప్రయాణ చార్జీలు ఆదా కావడం పట్ల షాద్ నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఉష అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సృష్టికి మూలం అమ్మ అని, ఓ కుటుంబంలో నలుగురు కుమారులు ఉంటే తప్పొప్పులను గ్రహించే శక్తి ఆ తల్లికి ఉంటుందని, అలాగే ప్రజా స్వామ్యంలో నాలుగైదు పార్టీలు ఉంటే ఏ పార్టీ ఏం చేస్తుందో, ఎవరు మోసం చేస్తున్నారో గ్రహించే శక్తి ఒక మహిళ లకే ఉంటుందని అన్నారు.

మహిళలు గుడికి, బడికి, ఉద్యోగానికి, వ్యాపారానికి, పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. షాద్ నగర్ ఆర్టీసీ డిపో నుంచి నడిచే బస్సులలో ప్రతినిత్యం 30 వేల మంది మహిళలు మహిళా లక్ష్మి పథకాన్ని వినియోగించుకుంటున్నారని, ప్రతిరోజు సుమారు రూ. 14 లక్షల వరకు డిపోకు ఆదాయం సమకూరుతుందని అన్నారు.షాద్ నగర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రతినిత్యం ఉపాధి కోసం పట్టణానికి వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో రూ.5000 వరకు ప్రతినెల ఆదా అవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలను ఏ విధంగా ఆదుకోవాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా పనిచేస్తుందని 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, పావలా వడ్డీ రుణాలను మహిళలకు అందిస్తూ వారికి ఆర్థికంగా చేయూతను అందిస్తుందని తెలిపారు.


రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉందని, ప్రజా పాలన ప్రభుత్వంలో మహిళల ముఖాల్లో సంతోషాలు కనబడుతున్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మహిళలను గౌరవించి, వారికి సన్మానం చేసి వారితో మాట్లాడడం జరిగిందని అన్నారు. వారితో మాట్లాడుతుంటే వారి కళ్ళలో ఆనందం, సంతోషం చూసి గర్వంగా ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. అనంతరం పలు గ్రామాల మహిళలను, మహిళా సంఘాల సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఉష, ఫరూఖ్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరి బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందేమోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, నందిగామ సర్పంచ్ కొమ్ము కృష్ణ, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story