- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెరవేరిన మూడు దశాబ్దాల కల.. ఆనందంలో రుద్రారం గ్రామస్తులు!
అది ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 ఏళ్ల నిరీక్షణ! ఎన్నో ఏళ్లుగా గుంతల మయమైన బాటలో నరకం చూసిన ఆ గ్రామ ప్రజల కష్టాలు నేటితో ముగిశాయి.

దిశ, దౌల్తాబాద్: అది ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 ఏళ్ల నిరీక్షణ! ఎన్నో ఏళ్లుగా గుంతల మయమైన బాటలో నరకం చూసిన ఆ గ్రామ ప్రజల కష్టాలు నేటితో ముగిశాయి. రుద్రారం గ్రామం నుండి పటిమిదిపల్లి మీదుగా తాండూరు వరకు నిర్మించనున్న నూతన రోడ్డు పనులను నేడు అత్యంత ఉత్సాహంగా ప్రారంభించారు.
చిరకాల స్వప్నం.. నేడు సాకారం!
రుద్రారం గ్రామ ప్రజలకు తాండూరు వెళ్లాలంటే రోడ్డు లేక పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గత మూడు దశాబ్దాలుగా పాలకులు మారుతున్నా, ఏళ్ల తరబడి వినతులు ఇస్తున్నా అడుగు ముందుకు పడలేదు. కానీ, గ్రామస్తుల పట్టుదల, పెద్దల చొరవతో శుక్రవారం ఈ రోడ్డు పనులు పట్టాలెక్కాయి. దీంతో రుద్రారం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. "మా కళ్లముందే రోడ్డు నిర్మాణం ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది" అని స్థానికులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంలో గ్రామ పెద్దలు ఆర్.ఆనంద్ రెడ్డి, టి.సాయప్ప, పి.అంబయ్య గౌడ్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. వారితో పాటు వార్డు మెంబర్లు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మిఠాయిలు పంచుకున్నారు.
తగ్గనున్న దూరం
ఈ రోడ్డు పూర్తి అయితే రుద్రారం, పటిమిది పల్లి గ్రామాల ప్రజలకు తాండూరు వెళ్లేందుకు ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. రవాణా సౌకర్యం పెరగడంతో గ్రామాల్లో ఆర్థిక అభివృద్ధికి కూడా బాటలు పడతాయని గ్రామ పెద్దలు ఆశాభావం వ్యక్తం చేశారు.






