- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక కాల్ – ఒక స్పందన – ఒక ప్రాణం రక్షణ..
ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న యువకుడి ప్రాణాలు కాపాడిన బ్లూ కోల్ట్స్ హోంగార్డులు ఫ్యూచర్ సిటీ కమీషనర్ తరుణ్ జోషి అభినందించారు.

దిశ, ఇబ్రహీంపట్నం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న యువకుడి ప్రాణాలు బ్లూ కోల్ట్స్ హోంగార్డులు కాపాడిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మంచాల మండలం, జపాల గ్రామానికి చెందిన రమేష్ మే 21 రాత్రి 10.30గంటల సమయంలో డయల్-100కు కాల్ చేసి తన కుమారుడు శ్యామ్ కుమార్ ఇబ్రహీంపట్నం చెరువు వద్ద ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది చెరువు వద్దకు చేరుకొని గాలింపు చేపట్టారు. చెరువు అంచున తీవ్ర మనోవేదనతో ఉన్న శ్యామ్ కుమార్ ను దగ్గరకు వెళ్లగా, ఎవరూ తన దగ్గరకు రావద్దని, వస్తే చెరువులో దూకుతానని హెచ్చరించాడు.
సేవా భావానికి ఇది నిదర్శనం..
కాగా విధి నిర్వహణలో ఉన్న బ్లూ కోల్ట్స్ హోంగార్డులు మొహన్‌దాస్ (హెచ్ జి -315), మోహన్ నాయక్ (హెచ్ జి -1244) చాకచక్యంగా వ్యవరించి సహనంతో, మానవీయ దృక్పథంతో అతనితో మాట్లాడుతూ.. అతనికి ధైర్యం చెప్పారు. అదే సమయంలో స్థానికుల సహాయంతో మరో వైపు నుండి జాగ్రత్తగా అతని వద్దకు చేరుకొని యువకుడిని సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనికి కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు. ఈ సందర్బంగా హోంగార్డులు మొహన్‌దాస్, మోహన్ నాయక్ ప్రదర్శించిన అప్రమత్తత, మానవీయ దృక్పథాన్నికి ఫ్యూచర్ సిటీ కమీషనర్ తరుణ్ జోషి శుక్రవారం తన ఛాంబర్ లో అభినందించారు. కాగా ఇది తెలంగాణ పోలీసుల సేవా భావానికి ఇది నిదర్శనం అని పేర్కొన్నారు. "ఒక కాల్ – ఒక స్పందన – ఒక ప్రాణం రక్షణ". అత్యవసర సమయంలో డయల్-100కు కాల్ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చని ఈ ఘటన మళ్లీ రుజువు చేసింది.






