- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాగజ్‌నగర్‌లో బాస్ ఎవరు.. కలెక్టరా కమిషనరా ..
చట్టం చుట్టమైపోయింది ఉన్నతాధికారుల ఉత్తర్వులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయి.

దిశ, కాగజ్‌నగర్: చట్టం చుట్టమైపోయింది ఉన్నతాధికారుల ఉత్తర్వులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయి. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలోకి వచ్చి, తప్పును వేలెత్తి చూపి, స్పాట్‌లోనే జరిమానా వేయండి అని ఆదేశిస్తే ఆ ఆదేశాలను నమిలి మింగేసే ధైర్యం కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌కు ఎక్కడి నుంచి వచ్చింది. కలెక్టర్ పర్యటన ముగిసిందో లేదో ఇచ్చిన ఆర్డర్లను బుట్టదాఖలు చేస్తూ మున్సిపల్ అధికారులు, నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారుల ప్రయోజనాలే పరమావధిగా మున్సిపల్ యంత్రాంగం నడుపుతున్న కమిషన్ల రాజ్యంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. పట్టణాన్ని పారిశుధ్య కోణంలో అద్దంలా మార్చాలన్న సంకల్పంతో జిల్లా కలెక్టర్ గురువారం కాగజ్‌నగర్ మార్కెట్ వీధుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పట్టణంలోని గురుకృప వారాహి హోటల్ వద్ద పారేస్తున్న వ్యర్థాలు, అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి కలెక్టర్ ఆగ్రహంతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ సదరు హోటల్‌కు తక్షణమే భారీ జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్‌ను అక్కడికక్కడే ఆదేశించారు. కలెక్టర్ ఉన్నంతసేపు యస్ మేడం.. నో మేడం అంటూ చేతులు కట్టుకుని నిల్చున్న కమిషనర్, కలెక్టర్ కారు ఎక్కి వెళ్లగానే తన అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. కలెక్టర్ ఆదేశించినా గురుకృప వారాహి హోటల్‌పై పైసా జరిమానా వేయకుండా, కనీసం నోటీసు ముక్క కూడా ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యవహరించారు. కలెక్టర్ ఆదేశాల కంటే సదరు హోటల్ యాజమాన్యం నుంచి అందే నజరానాలు అంత పవర్ ఫుల్ లా అని. మున్సిపల్ అధికారుల పనితీరు మార్చుకోకపోతే సహించేది లేదు అని జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులను హెచ్చరించిన ఇక్కడి అధికారులకు మాత్రం చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే ఉంది. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి కమిషనర్‌కు ఉన్న అభ్యంతరం ఏమిటి, జిల్లా బాస్ ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నారంటే మున్సిపల్ శాఖలో ఏ స్థాయి అవినీతి తిష్ట వేసిందో అర్థం చేసుకోవచ్చు. కాగజ్‌నగర్ పట్టణాన్ని మురికికొంపగా మారుస్తున్న కొందరు అక్రమార్కులతో మున్సిపల్ అధికారులకు ఉన్న అపవిత్ర బంధం వల్లే ఈ దుస్థితి దాపురించిందని. పట్టణాన్ని భ్రష్టు పట్టిస్తున్న వ్యాపారులు రోడ్లను కబ్జా చేస్తున్న, మున్సిపల్ అధికారులే వెన్నుదన్నుగా నిలుస్తున్నారని, కలెక్టర్ ఆదేశాలు పాటించకపోతే ఉద్యోగం ఊడుతుందనే వణుకు అధికారుల్లో లేకపోవడమే ఈ బరితెగింపునకు కారణం అని ప్రజలు వాపోతున్నారు.






