మురికి వీధులు నిజమైన దెబ్బలు.. స్లమ్‌డాగ్ టీజర్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

by Chukka Sudharani |

విజయ్ సేతుపతి నటిస్తున్న ‘స్లమ్ డాగ్’ నుంచి టీజర్ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్.

మురికి వీధులు నిజమైన దెబ్బలు.. స్లమ్‌డాగ్ టీజర్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
X

దిశ, సినిమా: ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నుంచి వస్తున్న చిత్రం ‘స్లమ్‌డాగ్-33 టెంపుల్ రోడ్’. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ పూరీ జాగన్నాథ్. ‘స్లమ్‌డాగ్’ టీజర్ రాబోతున్నట్లు ప్రకటిస్తూ.. ‘మురికి వీధులు.. నిజమైన దెబ్బలు.. క్రూరమైన భావోద్వేగాలు.. జూన్ 8న సాయంత్రం 6 గంటలకు అద్భుతమైన టీజర్‌తో స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది.. మీరు సిద్ధంగా ఉండండి..’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కళ్లకు గంతలు కట్టుకుని.. రక్తంతో నిండిన కత్తిని తలపై పెట్టుకుని ఉన్న విజయ్ సేతుపతి బ్యాక్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ హైప్‌కు క్రియేట్ చేస్తుంది. కాగా.. ఈ మూవీని తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Next Story