- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నార్సింగి సర్కిల్ లో అధికారుల ఉక్కుపాదం
నార్సింగి సర్కిల్ పరిధిలో మున్సిపల్ అధికారులు ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించారు.

దిశ, గండిపేట : నార్సింగి సర్కిల్ పరిధిలో మున్సిపల్ అధికారులు ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించారు. గురువారం మొదటగా నార్సింగి లోని ఆర్కే గ్రాండ్ హోటల్ నుంచి పాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వరకు ఫుట్ పాత్ లపై ఏర్పాటు చేసిన నిర్మాణాలను రెండు జేసీబీలతో తొలగించారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి నార్సింగి వైఎస్ఆర్ విగ్రహం వరకు రోడ్డుకు ఇరు వైపులా ఆక్రమణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. నార్సింగి సర్కిల్ ఏసీపీ మనోహర్ ఆధ్వర్యంలో సుమారు 40 నిర్మాణాలను తొలగించారు. ఆక్రమణల తొలగింపు సమయంలో పలువురు అడ్డుపడటంతో ఉద్రిక్తత నెలకొంది. నార్సింగి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫుట్ పాత్ లను ఆక్రమించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి హెచ్చరించారు. బాధితులకు ఎలాంటి సమయం, నోటీసులు ఇవ్వకుండా తొలగించడం సబబు కాదని పలువురు బీజేపీ నేతలు మండిపడ్డారు.






