పరిగిలో కృష్ణవేణి టాలెంట్ పాఠశాలకు నోటీసులు

by Chintha Aamani |   (  Updated:2025-06-18 15:55:28  IST  )

నిబంధనలకు విరుద్ధంగా పరిగి పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్

పరిగిలో కృష్ణవేణి టాలెంట్  పాఠశాలకు నోటీసులు
X

దిశ,డైనమిక్ బ్యూరో : నిబంధనలకు విరుద్ధంగా పరిగి పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ అమ్ముతున్నారు అన్న ఫిర్యాదుతో ఎంఈఓ తన సిబ్బందితో తనిఖీలు చేశారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలను అమ్మటం చేస్తున్నారన్న ఏబీవీపీ సంఘ నాయకులు సాయి ఫిర్యాదుమేనకు తనిఖీ చేసినట్లు ఎంఈఓ తెలిపారు. పాఠశాల పక్కనే రాయల్ బేకరీ లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పాఠశాలకు సంబంధించిన నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలను అక్కడ అమ్ముతుండగా ఎంఈఓ గోపాల్ తనిఖీ చేసి పట్టుకున్నారు. పాఠ్య పుస్తకాలు అమ్మడం నేరం అన్న విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. అనంతరం పుస్తకాల అమ్ముతున్న గదిని సీజ్ చేశారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నోటీసులు అందజేశారు.

Next Story