డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన మరో లారీ

by Batti.Sumithra |

డీజిల్ ట్యాంకర్‌ను మరో లారీ ఢీ కొట్టడంతో డీజిల్ అంతా రోడ్డు పాలైంది.

డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన మరో లారీ
X

దిశ, పరిగి : డీజిల్ ట్యాంకర్‌ను మరో లారీ ఢీ కొట్టడంతో డీజిల్ అంతా రోడ్డు పాలైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం షాద్‌నగర్ వైపు నుంచి పరిగి వైపునకు వస్తున్న డీజిల్ ట్యాంకర్‌ను ఎదురుగా వస్తున్న మరో లారీ మంగళవారం రాత్రి ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్‌లో ఉన్న డీజిల్ అంతా రోడ్డు పై లీకై పారిపోయింది. డీజిల్ లీక్ కావడంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని భావించిన ప్రయాణికులు భయంతో దూరంగా నిలుచున్నారు. పేలుడు సంభవించే ప్రమాదం ఉండటంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లక్షల రూపాయల విలువైన డీజిల్ రోడ్డుపాలవుతున్నా, ఏమీ చేయలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story