- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లగ్జరీ ఇండ్ల కొనుగోళ్లలో హైదరాబాద్ హవా.. ‘నార్త్’లో విల్లాలు, హైరైజ్ అపార్ట్ మెంట్లకు మస్తు డిమాండ్..
హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌లో ఉత్తర ప్రాంతాల ప్రాజెక్ట్ లకు డిమాండ్ పెరుగుతోంది.

దిశ, మేడ్చల్ బ్యూరో : హైరైజ్ అపార్ట్ మెంట్లు.. ప్రీమియం విల్లాల ప్రాజెక్టులతో నార్త్ హైదరాబాద్ దూసుకుపోతుంది. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు గృహాల కొనుగోళ్ల కోసం ఉత్తర దిశవైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా ఈ దిశన గృహ విక్రయాలలో వృద్ది నమోదవుతోంది. ఎక్స్‌ఛెంజ్ రేటు తక్కువగా ఉన్నందున ప్రవాసులు, హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) లగ్జరీ గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు డెవలపర్లు అందించే డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఆయా వర్గాల కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.
ఉత్తరంలో హవా..
హైదరాబాద్ రియల్టీ మార్కెట్ లో ఉత్తర ప్రాంతాల ప్రాజెక్ట్ లకు డిమాండ్ పెరుగుతోంది. మూడు త్రైమాసికాల నుంచి కొత్త ప్రాజెక్ట్స్ లాంచిగ్స్ నార్త్ హైదరాబాద్ లో పెరిగినట్టు రియల్ రంగ నిపుణులు తెలియజేస్తున్నారు. జూబ్లీ బస్టాండ్ నుంచి మేడ్చల్, శామీర్ పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, మెట్రో ప్రాజెక్టులు వస్తున్ననేపథ్యంలో మిగితా ప్రాంతాలతో పోల్చితే నార్త్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుందని రియల్ ఎస్టేట్ ప్రముఖులు తెలియజేస్తున్నారు. నార్త్ హైదరాబాద్ లో గుండ్ల పోచంపల్లి, మేడ్చల్, కండ్లకోయ, రావల్ కోల్, పూడురు, శామీర్ పేట, ఉప్పర్ పల్లి, బొమ్మరాసి పేట, దేవరయాంజాల్, మజీద్ పుర, కీసర, చీర్యాల, గోధుమకుంట, అలియాబాద్ తదితర ప్రాంతాలు రియల్టీ హాట్ స్పాట్స్ గా మారాయి. ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టే బదులు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు చాలా మంది కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా ఉంటుందన్నసూత్రం ప్రకారమే ..డెవలపర్లు కూడా ప్రాజెక్ట్ లాంచింగ్ లలో లగ్జరీకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
పల్లె నుంచి పట్నంగా..
ఉత్తర హైదరాబాద్ లోని గ్రామాలన్నీ మున్సిపాలిటీలలో విలీనం అయ్యాయి. దీంతో ఇన్నాళ్లు పల్లె ప్రాంతంగా ముద్రపడిన ఉత్తర హైదరాబాద్ ఇప్పుడు నగరంగా మారుతోంది. దీంతో రియల్ ఎస్టేట్ తో పెట్టుబడుదారులకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఉత్తర హైదరాబాద్ ను పరిశీలించినట్లయితే మేడ్చల్, కాళ్లకల్ నుంచి తూప్రాన్ వరకు రియల్టీ రంగం వేగంగా విస్తరిస్తోంది. ముందు రియల్టీలో దూసుకుపోయిన పశ్చిమ హైదరాబాద్ కు ఇప్పుడు ఉత్తర హైదరాబాద్ సవాల్ గా మారింది. ఈ ఏరియాలో రహదారుల విస్తరణతోపాటు ప్లై ఓవర్స్, ఓఆర్ఆర్, ఎన్ హెచ్ 44లతో అనుసంధానం వంటి మౌలిక సదుపాయాలు శరవేగంగా డెవలప్ అవుతూ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతం నగర అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తుంది. అదే విధంగా కండ్లకోయ లో నిర్మాణంలో ఉన్న గేట్ వే ఐటీ పార్క్, ఈ పార్క్ టెక్ కేంద్రంగా మారుతుండటంతో అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొంపల్లిలో ఐటీ పార్కు, శామీర్ పేటలోని జీనోమ్ వ్యాలీ 3.0 విస్తరణ కూడా అటు ఫార్మా, ఇటు బయోటెక్ రంగాల పెట్టుబడులను విపరీతంగా ఆకర్శిస్తున్నాయని చెప్పవచ్చు.






