రంగారెడ్డిలో మొదటి విడతకు పోటెత్తిన నామినేషన్లు.. రాత్రి వరకు కొనసాగిన నామినేషన్ల స్వీకరణ

by Ramesh Naini |

రంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పోటెత్తాయి.

రంగారెడ్డిలో మొదటి విడతకు పోటెత్తిన నామినేషన్లు.. రాత్రి వరకు కొనసాగిన నామినేషన్ల స్వీకరణ
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : రంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పోటెత్తాయి. మొదటి విడతకు ఈ నెల 27 నుంచి నామినేషన్లను స్వీకరించారు. మొదటి నుంచి నామినేషన్ల జోరు కొనసాగగా.. చివరి రోజు అభ్యర్థులు క్యూ కట్టారు. మొదటి విడతలో ఫరూక్‌ నగర్‌, చౌదరి గూడ, కేశంపేట్‌, కొత్తూరు, కొందుర్గు, నందిగామ, శంషాబాద్‌ మండలాల్లోని 174 సర్పంచు స్థానాలకు, 1,530 వార్డు స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. రెండో రోజు నాటికే సర్పంచ్ స్థానాలకు 349 నామినేషన్లు, వార్డు స్థానాలకు 810 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడో రోజు అనూహ్యంగా అభ్యర్థుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండడంతో సాయంత్రం 5 గంటల తర్వాత కూడా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సాగింది. గడువు సమయానికి నామినేషన్‌ హాల్‌ లో ఉన్న వారి నుంచి రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లను స్వీకరించారు.

రాత్రి 10.30 వరకు సర్పంచ్ నామినేషన్లు 581, వార్డులకు 2,520 అందాయి. ఇంకా నామినేషన్లు తీడుకుంటుండడంతో .ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం నామినేషన్లను పరిశీలించి చెల్లుబాటు అయిన నామినేషన్ల వివరాలను అధికారులు వెల్లడిస్తారు. సోమవారం అప్పీళ్లు స్వీకరించి డిసెంబర్ 2న అప్పీళ్లను పరిష్కరించనున్నారు. డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. 11న పోలింగ్‌ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపడతారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహిస్తారు.

నేడు రెండో విడతకు నామినేషన్ల స్వీకరణ..

రెండో విడత ఎన్నికలకు సంబంధించి ఆదివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. డిసెంబర్ 2 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. రెండో విడతలో చేవెళ్ల రెవిన్యూ డివిజన్‌ లోని శంకర్‌ పల్లి, మొయినాబాద్‌, చేవెళ్ల, షాబాద్‌, కందుకూరు రెవిన్యూ డివిజన్‌ లోని ఆమన్‌ గల్‌, కడ్తాల్‌, తలకొండ పల్లి మండలాల్లోని 178 స్థానాలకు, 1,540 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల పరిశీలన, 6న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. డిసెంబరు 14న పోలింగ్‌ నిర్వహించి అదే రోజు ఫలితాన్ని ప్రకటిస్తారు.

Next Story