- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పడకేసిన పారిశుధ్యం.. ఏ వీధికెళ్లినా కంపుకంపు..!
తాండూరులో పారిశుధ్యం పడకేసింది. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే కనిపిస్తున్నాయి.

దిశ, తాండూరు : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6, 2026 నుంచి జూన్ 12, 2026 వరకు అమలవుతున్నది. ఈ ప్రణాళిక మున్సిపాలిటీలో పారిశుధ్యం, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందుకు విరుద్ధంగా పారిశుధ్య నిర్వహణలో అధికారులు నిద్రమత్తు వీడడం లేదు. ఎక్కడ చూసినా.. చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. శివాజీ చౌక్ నుంచి అంగన్‌వాడీ భవనం ఘణపూర్ 34వ వార్డు వరకు 4 నుంచి 5 రోడ్డు పక్కన చెత్తకుప్పలు ఉన్నా యి. HDFC బ్యాంక్ ఎదురుగా చెత్త ఉంది. రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పక్కన అక్కడక్కడ చెత్త కుప్పలు ఉన్నాయి. దీంతో ప్రజలు పలు రోగాలబారిన పడుతున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో చెత్తలు, మురుగు పేరుకుపోయి పారిశుధ్యం అధ్వానంగా మారింది. కొన్ని వీధుల్లో కంపుతో స్థానికులు నరకం చూస్తున్నారు. ప్రధాన వీధుల్లో ఎక్కడికక్కడ చెత్తకుప్పలు కనిపిస్తున్నాయి. రోజుల తరబడి చెత్తను తొలగించకపోవడంతో తీవ్రమైన కంపు కొడుతోందని పలువురు విమర్శిస్తున్నారు.
ఎక్కడ చూసినా.. చెత్త కుప్పలే..!
మరోపక్క నివాసాల మధ్య చెత్త పేరుకుపోతోంది. కాలువల్లో మురుగు పారడం లేదని స్థానికులు అంటున్నా రు. పగలు, రాత్రి దోమలు దాడి చేస్తున్నాయని, ఏం రోగాలు వస్తాయోనని భయపడుతున్నారు. చెత్తకుప్పల వద్దకు పందులు, కుక్కలు చేరి చెత్తను చెల్లాచెదురు చేస్తున్నాయి. దీంతో కంపు ఎక్కువవుతోందని, దోమలు, విష పురుగులకు ఆవాసంగా మారుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని, పారిశుధ్య పనులను సక్రమంగా నిర్వహించి, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.






