- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాదర్‌గుల్ భూవివాదం.. ఆగని రైతుల పోరాటం
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్ గుల్ భూ వివాదంపై బాధిత రైతుల పోరాటం ఆగడం లేదు.

దిశ, రంగారెడ్డి బ్యూరో : రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్ గుల్ భూ వివాదంపై బాధిత రైతుల పోరాటం ఆగడం లేదు. ఇప్పటికే ఎంతోమందికి తమ గోస చెప్పు కున్న రైతులు తాజాగా.. బుధవారం మాజీ మంత్రి హరీష్ రావును కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. నాదర్ గుల్ పరిధిలోని సర్వే నంబర్ 613 (119) కాసుబాగ్ కంచలో రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా దాడులు, పోలీసుల వేధింపుల నుంచి తమను రక్షించాలని హరీష్‌రావుకు విన్నవించారు. కబ్జాదారులు వేసిన కంచెలు, ధ్వంసమైన తమ వ్యవసాయ బోర్లు, దాడుల్లో గాయపడిన ఫొటోలు, వీడియోలను హరీష్ రావుకు చూపించి తమ గోసను వెళ్లబోసుకున్నారు. రైతుల సమస్యలు విన్న హరీశ్ రావు తక్షణమే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే కుట్ర : హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ప్రైవేట్ వ్యక్తులకు నాదర్ గుల్ భూములను ధారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని హరీష్ రావు మండిపడ్డారు. నాదర్ గుల్ భూములు అన్యాక్రాంతం కాకుండా గతంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద హైకోర్టు వరకు న్యాయపోరాటం చేసిందని గుర్తుచేశారు. ఆ భూములు ప్రభుత్వానివే అని ప్రస్తుత ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందన్నారు. ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణ కోసమే హైడ్రా తీసుకొచ్చామని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి.. నాదర్ గుల్ లోని వేల కోట్ల ప్రభుత్వ భూమి, అందులోని చెరువును రియల్ ఎస్టేట్ రాబందులు కబ్జా చేస్తుంటే ఎందుకు నిద్రపోతున్నారని ప్రశ్నించారు. హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో ప్రభుత్వ భూములను, అందులోని చెరువులను, ఫీడర్ ఛానల్ ను ధ్వంసం చేస్తూ కంచెలు వేసి కబ్జా చేస్తున్న బడా రియల్ ఎస్టేట్ సంస్థల వైపు కన్నెత్తి చూసే దమ్ము హైడ్రాకు ఉందా? అని ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా హరీష్ రావు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ సజ్జనార్, స్థానిక ఆర్డీవో, ఎమ్మార్వోలకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. రైతులకు న్యాయం జరగని పక్షంలో తానే స్వయంగా బీఆర్‌ఎస్ పార్టీ బృందంతో నాదర్ గుల్ భూములను సందర్శిస్తానని అధికారులకు తేల్చిచెప్పారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హరీష్ రావు రైతులకు భరోసా ఇచ్చారు. హరీష్ రావు అధికారులతో మాట్లాడిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగిందని రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
కలెక్టర్,ఆర్డీవోలతో ఇలా..
ప్రభుత్వ సీలింగ్ భూములకు కలెక్టర్, ఆర్డీవోలే కస్టోడియన్లుగా ఉంటారు. ఇది ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టులో మీరే ఫైల్ చేశారు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్లు కంచెలు వేస్తుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారు. వెంటనే ఆ కంచెలు తొల గించి, తాతల కాలం నుంచి వ్యవసా యం చేసుకుంటున్న రైతులకు మళ్లీ సాగు చేసుకునే అవకాశం కల్పిం చండి. ముదిరాజ్ లకు చెరువులో చేపలు పట్టుకునే హక్కును కల్పిం చి, చెరువుకు వెళ్లే ఫీడర్ ఛానళ్లను ధ్వంసం చేస్తున్న వారిపై కఠిన చర్య లు తీసుకోండి. గుడిలో పూజలు చేసుకునేందుకు ప్రజలను అనుమతించాలని అధికారులను కోరారు.
ఎమ్మార్వోతో ఇలా..
అది ప్రభుత్వ భూమి అయినప్పుడు, అందులోకి అక్రమంగా ప్రవేశించిన ప్రైవేట్ వ్యక్తులు, రౌడీలపై ప్రభుత్వ అధికారిగా మీరు పోలీస్టేషన్లో ఎందుకు కంప్లెంట్ ఇవ్వడం లేదు ? వెంటనే కబ్జాదారులను వెళ్లగొ ట్టి వాళ్లపై కేసు పెట్టండి అని ఎమ్మార్వోకు సూచించారు.
సీపీ సజ్జనార్‌తో ఇలా..
ఆదిభట్ల పోలీసులు రియల్ ఎస్టేట్ మాఫియాకు కొమ్ముకాస్తున్నారు. రైతులు ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకోవడం లేదు. పైగా రైతులపైనే దొంగ కేసులు పెడుతున్నారు. గుడికి, చెరువుకు వెళ్తున్న స్థానికులపై దాడి చేసిన కబ్జాదారుల రౌడీ లపై వెంటనే కేసులు నమోదు చేసి రైతులను రక్షించాలి. రైతు ల తరపున కూడా పోలీస్టేషన్లో కేసులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలి అని కోరారు.
ఇదీ నాదర్‌గుల్ భూముల వివాదం..
నాదర్‌గుల్‌లోని వివాదాస్పద భూముల్లో దాదాపు 70 ఏళ్లుగా శిస్తు చెల్లిస్తూ రైతులు భూముల ను సాగు చేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద బ్యాంకు ల నుంచి రుణాలు తెచ్చుకుని బోర్లు, బావులు తవ్వుకుని వ్యవ సాయం చేసుకుంటున్నారు. అయి తే.. ఎప్పుడో రద్దయిన శివరాజ్ బహదూర్ జాగీర్దార్ వార సుల పేరుతో నకిలీ ఏజీపీఏ పత్రా లను అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టే ట్ సంస్థలకు అప్పగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని రైతు ల ఆరోపణ. పోలీసుల అండదండలతో స్థానిక ఆదిభట్ల పోలీసులు, రౌడీషీటర్లను ఉసిగొల్పి భౌతిక దాడులకు తెగబడుతున్నారంటూ రైతులు ఆందోళన చేస్తూ వస్తున్నారు.
అక్రమ కేసులు బనాయింపు..
పచ్చని పొలాల చుట్టూ రేకులతో కంచె వేసి, రైతుల బోర్లను, వ్యవ సాయ పనిముట్లను ధ్వంసం చేశారన్నది రైతులు ఆవేదన చెందుతున్నా రు. ఇదేంటని అడిగిన రైతు లపై ఆదిభట్ల పోలీస్టేషన్‌లో అక్రమ కేసు లు బనాయిస్తున్నారని, రెవె న్యూ, పోలీసు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రైతు లు ఆవేదన వ్యక్తంచేశారు. చెరు వులో ముదిరాజ్ లను చేపలు పట్టుకోని వ్వకుండా, తాతల కాలం నాటి నుంచి ఉన్న తమ గుడి కి వెళ్ల కుండా దాడులు చేస్తున్నారని రైతు లు కన్నీటి పర్యంతం అవుతున్నారు.






