విద్యార్థి మృతికి సంతాపం

by Nallavelli.Anjaneyulu |

మాడ్గుల మండలం కాట్రామ్ తాండ కు చెందిన ఆంబోతు శివ హర్యానాలో ఎన్ఐటి చదువుతూ ఈనెల 16న అనుమానాస్పదంగా మృతి చెందారు.

విద్యార్థి మృతికి సంతాపం
X

దిశ, మాడ్గుల : మాడ్గుల మండలం కాట్రామ్ తాండ కు చెందిన ఆంబోతు శివ హర్యానాలో ఎన్ఐటి చదువుతూ ఈనెల 16న అనుమానాస్పదంగా మృతి చెందారు. గురువారం తండాలో నిర్వహించిన ఆయన అంతిమయాత్రలో మాజీ వైస్ ఎంపీపీ శంకర్ నాయక్ పాల్గొని మృతునికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ఆధైర్య పడవద్దు అండగా ఉండి ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జబ్బర్ లాల్ నాయక్, ఉప సర్పంచ్ బాలు నాయక్, వార్డు సభ్యులు, గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story