27 గ్రామ పంచాయతీ భవనాలకు రూ.5.40 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే

by Kodari Anjali |

షాద్‌నగర్ నియోజకవర్గ గ్రామాలకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది.

27 గ్రామ పంచాయతీ భవనాలకు రూ.5.40 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే
X

దిశ, షాద్‌నగర్: షాద్‌నగర్ నియోజకవర్గ గ్రామాలకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. నియోజకవర్గ పరిధిలోని 27 గ్రామ పంచాయతీలకు కొత్త భవనాల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు రూ.5.40 కోట్ల నిధులను ఎంజీఎన్‌ఆర్ఈజీఎస్ కింద కేటాయించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ వివరాలు వెల్లడించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGS వార్షిక మాస్టర్ సర్క్యులర్ 2024-25 ప్రకారం.. ఈ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ సమర్పించిన అంచనాల ప్రకారం, ఒక్కో గ్రామ పంచాయతీ భవనానికి రూ.20 లక్షల చొప్పున వ్యయం అవుతుందని, 2026-27 ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. నిధులు అందుబాటులో ఉన్న మేరకు దశలవారీగా పనులు చేపడతారని మొదటి విడతలో 3 గ్రామాలకు అనుమతి వచ్చిందని చౌదర్‌గూడ మండలం చౌదర్‌గూడ, పెద్దాపూర్ ఫరూఖ్‌నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామపంచాయతీలకు, సీసీ రోడ్లకు మరో రూ.2 కోట్లు గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం కోసం అదనంగా రూ.2 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో ఈ పనులు సైతం ప్రారంభమవుతాయని అన్నారు.

గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను

షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూక్‌నగర్ మండలంలో దొంతికుంట తండా, కిరాయి గుట్ట తండా, ముండూరి రాయి, నేరెళ్ల చెరువు, పీర్లగూడ, పులిచెర్లకుంట, రామేశ్వరం, రంగంపల్లి, శేరిగూడ, వెంకన్నగూడ తాండ, అయ్యవారిపల్లి, చౌదర్‌గూడ మండలంలో చౌదర్‌గూడ, పీర్జాపూర్, కేశంపేట్ మండలంలో అల్వాల్, దత్తాయిపల్లి, కేశంపేట్, సంతాపూర్, తుర్పుగడ్డ, దేవునిగూడ, కొందుర్గు మండలంలో చెర్కుపల్లి, ముట్పూర్, అయోధ్యపూర్ (టి), శ్రీరంగాపూర్, తంగెళ్లపల్లి, కొత్తూరు మండలం లో కోడిచెర్ల తండా, వైఎం తండా, నందిగామ మండలంలో తాళ్ళ గూడ 27 గ్రామపంచాయతీలకు నూతన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాలను గాలికి వదిలేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామీణ పరిపాలన బలోపేతంపై దృష్టి సారించిందని.. సొంత భవనాలు రావడంతో పంచాయతీ కార్యాలయాలు ఒకే చోట, ప్రజలకు సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే అన్నారు. భవన నిర్మాణం, నిధుల వినియోగంపై సర్పంచులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే శంకర్ సూచించారు.

Next Story