చీరలో మరింత అందంగా మెరిసిన రీతూ వర్మ.. ఎలిగెంట్ లుక్‌తో ఆకట్టుకుంది.

by Pulgam srinivas |   (  Updated:2026-06-24 08:01:09  IST  )

స్కై బ్లూ శారీలో క్లాస్ లుక్‌తో మెరిసిన రీతూ వర్మ

చీరలో మరింత అందంగా మెరిసిన రీతూ వర్మ.. ఎలిగెంట్ లుక్‌తో ఆకట్టుకుంది.
X

దిశ, వెబ్ డెస్క్: బ్యూటిఫుల్ నటి రీతూ వర్మ 'బాద్ షా' సినిమాలో కాజల్ అగర్వాల్ కి చెల్లెలు పాత్రలో నటించి చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించింది. ఆ తర్వాత ఈమె పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీ మంచి విజయం సాధించడం, ఇందులో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ బ్యూటీకి ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె కేవలం తెలుగు చిత్రాలు మాత్రమే కాకుండా పలు ఇతర భాష చిత్రాల్లో కూడా నటించి గుర్తింపును సంపాదించుకుంది.

ప్రస్తుతం రీతూ, గోపీచంద్ హీరోగా రూపొందుతున్న భరత వర్ష చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విజయం సాధిస్తే ఈమె క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

సినిమాల్లో భారీగా అందాలను ఆరబోయకుండా క్లాస్, డీసెంట్ పాత్రలతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువ శాతం మాత్రమే తన గ్రామర్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా మరోసారి క్లాస్ లుక్ తో ప్రేక్షకులను అలరించింది.

స్కై బ్లూ కలర్ శారీ కట్టుకొని, పింక్ కలర్ బ్లౌజ్ ధరించి డిఫరెంట్ యాంగిల్స్ లో ఈ బ్యూటీ ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఇందులో ఈమె మెడలో ఒక నక్లెస్ వేసుకొని కురులను అందంగా గాలికి వదిలేసి క్యూట్ స్మైల్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. మొత్తంగా ఇందులో ఈమె చాలా సూపర్ లుక్ లో ఉండడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story