- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ అంటే అన్నపూర్ణ కాదు... రత్నగర్భ కూడా: సీఎం చంద్రబాబు
బంగారం ఎక్కడికో తరలించి ఆభరణాలు తయారు చేసే బదులు ఇక్కడే ఓ జ్యుయలరీ పార్కు కూడా ఏర్పాటు చేస్తామని, ఈ పరిశ్రమకు అనుమతులు, భద్రత కూడా కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ..

దిశ, వెబ్ డెస్క్: బంగారం ఎక్కడికో తరలించి ఆభరణాలు తయారు చేసే బదులు ఇక్కడే ఓ జ్యుయలరీ పార్కు కూడా ఏర్పాటు చేస్తామని, ఈ పరిశ్రమకు అనుమతులు, భద్రత కూడా కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా(Kurnool District)లో జొన్నగిరి(Jonnagiri)లో ఆయన పర్యటించారు. బంగారం(Gold) నిక్షేప ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు., అనంతరం గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) అంటే అన్నపూర్ణ మాత్రమే కాదని...ఏపీ అంటే రత్నగర్భ కూడా అని తెలిపారు. ‘‘మన రాష్ట్రంలో పండని పంటలు లేవు... దొరకని ఖనిజాలు లేవు. మంగంపేట బెరైటీస్, కడప లైమ్ స్టోన్, యురేనియం, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ ఉంది. చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్, కుప్పంలో గ్రీన్ గ్రానైట్, శ్రీకాకుళంలో బ్లూ గ్రానైట్. గూడూరు మైకా, నెల్లూరు సిలికా, ఉత్తరాంధ్ర తీరంలో బీచ్ శాండ్. అనంతపురం, కడపలో ఐరన్ ఓర్....కేజీ బేసిన్ లో గ్యాస్, పెట్రోల్. వీటిని సద్వినియోగం చేసుకునేందుకు వాల్యూ ఎడిషన్ పరిశ్రలను ప్రోత్సహిస్తున్నాం.’’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఏపీకి సిమెంటు, స్టీల్ పరిశ్రమలు
‘‘సిమెంటు, స్టీల్ పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయి. ఈ గనులు, వచ్చే పరిశ్రమలతో ఇక్కడి యువతకు ఇక్కడే ఉపాధి కల్పిస్తాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఏపీ ఓ మోడల్. గత పాలకులు అక్రమ సంపాదన కోసం పరిశ్రమల్ని బయటకు తరిమేశారు. కేవలం ఎన్డీఏ ప్రభుత్వ బ్రాండ్ తోనే పారిశ్రామిక వేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారు. సీమలో ప్రతి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది చేస్తున్నాం. స్పేస్, ఏరో స్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, స్టీల్, సిమెంట్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. కర్నూలు జిల్లాలో దేశంలో అతిపెద్ద డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను తీసుకువస్తాం. అనంతపురంలో నాడు కియా తెచ్చాం. నేడు 5th జనరేషన్ ఫైటర్ జెట్ల ప్రాజెక్టు తెచ్చాం. 2028 ఉత్పత్తి లక్ష్యంగా కడప జిల్లాలో జూలై 3న రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తున్నాం. కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ అభివృద్ది చేస్తున్నాం. తిరుపతిలో రాయల్ ఎన్ ఫీల్డ్ పరిశ్రమ తీసుకువచ్చాం.’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.






