- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చదువుతో పాటగా క్రీడలపై దృష్టిసారించాలి : ఎంపీ
2036 లో భారతదేశం ఒలంపిక్స్ కి ఆతిథ్యం ఇవ్వాలని కలలు కంటున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా క్రీడాకారులు సిద్ధం కావాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు.

దిశ, సిద్దిపేట అర్బన్: 2036 లో భారతదేశం ఒలంపిక్స్ కి ఆతిథ్యం ఇవ్వాలని కలలు కంటున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా క్రీడాకారులు సిద్ధం కావాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఒలంపిక్ రన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీ రఘునందన్ రావు పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా స్ఫూర్తితో పాటు జాతీయ సమైక్యతను కోరుతూ సిద్దిపేట ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒలంపిక్ రన్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. దేశ సమగ్రత సమైక్యతల కోసం ముందుకు వచ్చి దేశాన్ని ఒక గొప్ప క్రీడా గ్రామంగా మార్చాలని సంకల్పంతో సిద్దిపేట క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. చిన్నతనం నుంచి పిల్లలకు వారికి నచ్చిన క్రీడల్లో రాణించడానికి ప్రోత్సహించాలని ఈ దిశగా తల్లిదండ్రులు అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. విద్యకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నామో అదే విధంగా క్రీడలకు కూడా అంతే ప్రాముఖ్యతను శారీరక మానసిక దృఢత్వానికి దోహదపడే క్రీడలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అధికారులకు సూచించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్ ముదిరాజ్, డి వై ఎస్ ఓ వీరారెడ్డి, డీఈవో శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.






