- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి పదవుల కోసం మఠాధిపతులతో లాబీయింగ్.. కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్
మంత్రి పదవుల కోసం మఠాధిపతులు, నేతల ద్వారా లాబీయింగ్ చేయడంపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో డీకే శివకుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరినా అధిష్టానానికి తలనొప్పులు తప్పడం లేదు. మొన్నటి వరకు ముఖ్యమంత్రి మార్పు విషయంలో ఒత్తిళ్లు రాగా తాజాగా మంత్రివర్గంలో స్థానం కోసం లాబీయింగ్‍లు పెరిగిపోవడం హైకమాండ్‍కు సమస్యగా మారినట్లు తెలుస్తోంది. కేబినెట్‍తో తమకు బెర్త్ కల్పించాలని ఎమ్మెల్యేలు అధిష్టానానికి మొరపెట్టుకోవడంతో పాటు తమకు తెలిసిన వారి పక్షాన వివిధ మఠాధిపతులు సైతం లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
హైకమాండ్ సీరియస్!
సిద్దరామయ్య రాజీనామా తర్వాత జూన్ 3న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా, జి.పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా మొత్తం 14 మందితో కూడిన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక క్యాబినెట్‌లో గరిష్టంగా 34 మందికి అవకాశం ఉండటంతో మిగిలిన 20 ఖాళీ పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. తమ సామాజిక వర్గాల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ గత కొన్ని వారాలుగా వివిధ మఠాల స్వామీజీలు, కమ్యూనిటీ లీడర్లు బహిరంగంగా డిమాండ్లు చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరూ లాబీయింగ్‍లు చేయవద్దని ఎమ్మెల్యేలు, సన్యాసులు, కమ్యూనిటీ లీడర్లను కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగా హెచ్చరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తమ ఎమ్మెల్యేకు మంత్రిగా అవకాశం ఇవ్వాలంటూ ఇటీవల కొన్ని చోట్ల భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్పందించిన హైకమాండ్ బహిరంగ నిరసనలు, ప్రదర్శనలతో పాటు మఠాల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయవద్దని కరాఖండిగా చెప్పింది. ఇటువంటి చర్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయని, అనవసర వర్గపోరుకు దారితీస్తాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సంయమనం పాటించాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది.






