- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయికృష్ణ లాకప్ డెత్.. సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
విజయవాడలో సంచలన రేపిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది. సాయికృష్ణను లాకప్ డెత్ జరిగిందంటూ సిట్ రిపోర్టులో వెల్లడైంది..

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో సంచలన రేపిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది. సాయికృష్ణను లాకప్ డెత్ జరిగిందంటూ సిట్ రిపోర్టులో వెల్లడైంది. సాయికృష్ణకు సంబంధించిన వ్యవహారంపై ప్రభుత్వం సిట్ నియమించింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్లలో పని చేసిన సిబ్బందితో పాటు మార్కాపురం పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చిన సిబ్బందని సైతం సిట్ అధికారులు విచారించారు. ఈ విచారణలో సాయికృష్ణ లాకప్ డెత్ అయినట్లు తేలింది. అంతేకాదు ఆధారాలు దొరక్కుండా మాయం చేశారని సిట్ గుర్తించారు. సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో ఈ అంశాలన్నింటినీ సిట్ అధికారులు పేర్కొన్నారు. నాగరాజు మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో చూసినట్లు ఎస్సై వాంగ్మూలం ఇచ్చినట్లు సిట్ స్పష్టం చేసింది. సాక్ష్యాలు నాశనం చేయడానికి సీఐ ప్రయత్నం చేశారని వెల్లడించింది. ప్రస్తుతం నాగరాజును కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో నాగరాజు రిమాండ్‌కు తరలింపునకు సంబంధించిన వాదనలు వినిపించమని న్యాయవాదులు తెలిపారు.






