- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుకుమార్, బన్నీ వాస్ కాంబో సినిమాకి ముహూర్తం ఖరారు
సుకుమార్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మించనున్న సినిమా పూజా కార్యక్రమం జూన్ 25న నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌కు చెందిన సుకుమార్ రైటింగ్స్ సంస్థ, బన్నీ వాస్ వర్క్స్ తో కలిసి ఓ కొత్త చిత్రాన్ని ప్రారంభించబోతోంది. ఈ చిత్రంలో నటుడు ప్రియదర్శి హీరోగా కనిపించనుండగా, ఫోక్ డాన్సర్ నాగదుర్గ హీరోయిన్‌గా అలరించనుంది. ఈ సినిమాకు వంశీ రెడ్డి దర్శకత్వం వహించనుండగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందించనున్నారు. తాజాగా ఈ సినిమా బృందం ప్రాజెక్ట్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ‘ప్రొడక్షన్ నెం.1’ పేరుతో ముందుకు సాగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం వివరాలను వెల్లడించింది.
ఈ కొత్త చిత్రం పూజా కార్యక్రమం జూన్ 25న ఉదయం 9:30 గంటలకు జరగనుండగా, ఈ వేడుకను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్‌లో నిర్వహించనున్నట్లు మేకర్స్ తెలిపారు. అలాగే, “From the fragrance of our soil every home has a story” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను విడుదల చేయడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ నుంచి వస్తున్న కొత్త సినిమా కావడంతో సినీ అభిమానుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను పూజా కార్యక్రమం రోజున లేదా అనంతరం మేకర్స్ వెల్లడించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో మరో క్రేజీ సినిమాగా నిలిచే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






