- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపడుతున్న ప్రభుత్వం
మారుతున్న కాలానుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అనేక సంస్కరణలు చేపడుతోందని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య పేర్కొన్నారు.

దిశ, తుంగతుర్తి : మారుతున్న కాలానుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అనేక సంస్కరణలు చేపడుతోందని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య పేర్కొన్నారు. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు ధర్మారపు వెంకటయ్య బుధవారం తన ఇద్దరు పిల్లలను ప్రీ-ప్రైమరీ పాఠశాలలో చేర్పించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి, ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటయ్య తన ఇద్దరు పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించడం అభినందనీయమని అన్నారు. గ్రామాల్లోని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూడకుండా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన కోరారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక ప్రమాణాలతో కొనసాగుతున్నాయని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని సూచించారు. ఎంఈవో బోయిని లింగయ్య మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లో పెట్టే అధిక ఖర్చును పిల్లల ఉన్నత విద్య కోసం వినియోగిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. రైతు సహకార సంఘం చైర్మన్ గుడిపాటి సైదులు మాట్లాడుతూ గ్రామంలోని తల్లిదండ్రులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం గొడుగు అబ్బయ్య, పీఆర్‌టీయూ మండల కార్యదర్శి చిత్తలూరి శ్రీరాములు, గ్రామ సర్పంచ్ సోలిపురం అశ్వినీ లక్ష్మారెడ్డి, వార్డు సభ్యుడు మామిడి రమేష్‌తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






