రావణదహనం చేసిన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి

by Disha Web |
రావణదహనం చేసిన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
X

దిశ, పరిగి : పరిగిలో బుధవారం దసరా పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. దసరా పండగ సందర్భంగా ఆనవాయితిగా వస్తున్న ఆచారం ప్రకారం మేళతాళాలతో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, కొప్పుల అనిల్ రెడ్డి, హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నాయకులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు.

ఆలయంలో ఏర్పాటు చేసిన జమ్మి చెట్టుకు పరిగి పెద్దలు, పురోహితులు సిద్ధాంతి పార్థసారథి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డితో పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు జమ్మిని పంచుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం 10 తలలతో ఏర్పాటు చేసిన రావణాసురుడి బొమ్మను బాణాసంచాలతో దహనం చేశారు.

Next Story

Most Viewed