క‌ళాశాల‌కు వెళ్లిన విద్యార్థిని అదృశ్యం

by Ratna Kumari |   (  Updated:2026-02-19 13:37:42  IST  )

క‌ళాశాల‌కు వెళ్లిన ఓ విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదు. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

క‌ళాశాల‌కు వెళ్లిన విద్యార్థిని అదృశ్యం
X

దిశ‌, శంషాబాద్ : క‌ళాశాల‌కు వెళ్లిన ఓ విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదు. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శంషాబాద్ మండలంలోని పాలమాకుల గ్రామానికి చెందిన గూడెపు రచన (19) పెద్దషాపూర్ లోని బీ ఫార్మసి కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. ఫిబ్రవరి 18న ఉదయం 9:30 గంటలకు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆమె సాయంత్రం వరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్‌ రావడంతో ఆమె స్నేహితురాలిని సంప్రదించగా.. ఆ రోజు కాలేజీకి రాలేదని తెలిపారు. రచన కోసం చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story