- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలుడు అదృశ్యం..కేసు నమోదు
by Taduka Kalyani |
మైనర్ బాలుడు అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని రేగడి మైలారం పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ,బొంరాస్ పేట్ : మైనర్ బాలుడు అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని రేగడి మైలారం పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రేగడి మైలారం గ్రామ పంచాయతీ బాపన్ చెరువు తండాకు చెందిన రాథోడ్ మహేష్ (16)రేగడి మైలారం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. తేదీ 02/07/2026 గురువారం ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లి తిరిగి మళ్ళీ సాయంత్రం ఇంటికి చేరుకున్నాక ఆడుకోవడానికి వెళ్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికిన ఆచూకీ లభించలేదు.దాంతో తండ్రి శంకర్ రాథోడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, బాలుడు చామన ఛాయా రంగు కలిగి ఉండి నాలుగు అడుగుల ఎత్తు ఉంటాడని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే బొంరాస్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని ఎస్ఐ బాల వెంకట రమణ తెలిపారు.
Next Story






