మైసిగండి మైసమ్మ తల్లి జాతరకు వేళాయే!

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఈ నెల 5 తేదీ నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో స్నేహలత తెలిపారు.

మైసిగండి మైసమ్మ తల్లి జాతరకు వేళాయే!
X

దిశ, కడ్తాల్ : రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఈ నెల 5 తేదీ నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో స్నేహలత తెలిపారు. మండలంలోని మైసమ్మ తల్లి జాతర మహోత్సవాలులను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఆలయ ఫౌండర్ ట్రస్టీ ఆర్.లక్ష్మీ శిరోళీ పంతు నాయక్, ఈవో స్నేహలత వెల్లడించారు. జాతర మహోత్సవానికి విచ్చేసి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలను ఘనంగా జరిపేందుకు ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పారు. జాతర మహోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు బుధవారం కార్తీక పౌర్ణమి అమ్మవారికి క్షీరాభిషేకం అమ్మ హారతి విశేషాలు అలంకరణలతో ప్రారంభమై, గురువారం సహస్ర చండీయాగం, చిన్నతేరు, శుక్రవారం సహస్ర చండీయాగం,పెద్దతేరు, శనివారం సహస్ర చండీయాగం పూర్ణహుతి, ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించడం, బండ్లు తిప్పుట, సోమవారం అమ్మవారి కూరగాయలలో ప్రత్యేక అలంకరణ వివిధ ప్రత్యేక పూజ కార్యక్రమంతో ముగుస్తాయని తెలిపారు. జాతర మహోత్సవంలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.

అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాం

మైసమ్మ తల్లి జాతర మహోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ముందుగానే ఏర్పాటు చేశాం. 5 రోజుల పాటు కొనసాగే జాతర మహోత్సవాలకు ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేస్తున్నాం. జాతర మహోత్సవాలకు భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయాలి. - ఆలయ ఈ.వో స్నేహలత

కొలిచే వారికి కొంగు బంగారం మైసమ్మ తల్లి

దశాబ్దాల కాలం నుంచి మైసమ్మ తల్లి ఆలయానికి విచ్చేసిన భక్తులకు కొలిచేవారికి కొంగుబంగా కోరికలు తీరుస్తూ అమ్మవారు రాష్ట్రంలోనే ప్రత్యేక ప్రసిద్ధి పొందారు. ఈ పురతాన ఆలయాన్నిదాతల సహకారంతో అభివృద్ధి చేశాం. సుమారు 23 ఏళ్లుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. - ఆలయ ట్రస్టీ ఫౌండర్ ఆర్.లక్ష్మీ శిరోళీ పంతు నాయక్

Next Story