- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహాత్మా.. మన్నించు- గాంధీజీ విగ్రహం ధ్వంసం
by I. Sairam |
మహాత్మా గాంధీ వర్ధంతి రోజు ఆయనకు ఘోర అవమానం జరిగింది.

X
దిశ, గండిపేట: మహాత్మా గాంధీ వర్ధంతి రోజు ఆయనకు ఘోర అవమానం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు బాపూజీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన నార్సింగి సర్కిల్ పరిధిలోని మణి కొండ అల్కాపురి కాలనీలో జరిగింది. అల్కాపురి కాలనీలోని ఫ్రీడమ్ పార్కులో మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. వాటిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేశారు. అన్ని విగ్రహాలకు ముందు వరుసలో బాపూజీ విగ్రహం ఉంది. ఇదిలా ఉండగా మహాత్ముడి వర్ధంతి సందర్భంగా శుక్రవారం పలువురు నాయకులు వివిధ సంఘాల నేతలు నివాళి అర్పించేందుకు ఫ్రీడం పార్కు వెళ్లారు. మహాత్మా గాంధీ చేతి కాలి భాగంలో ధ్వంసం అయిన విషయం గమనించి ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం నాయకులు పూలమాలలు వేసి మహాత్ముడికి అంజలి ఘటించారు. అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని విగ్రహాన్ని బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Next Story






