- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగరంగ వైభవంగా జగన్నాథుడి రథయాత్ర
ఆషాఢ శుద్ధ విదియను పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణంలో జగన్నాథ రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

దిశ, షాద్ నగర్: ఆషాఢ శుద్ధ విదియను పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణంలో జగన్నాథ రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భగవంతుడు స్వయంగా భక్తుల వద్దకు వస్తాడనే నమ్మకంతో రథయాత్రను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో కళింగ కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర భక్తి పారవశ్యంతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను అలంకరించిన రథాలు పట్టణ వీధుల్లో ఊరేగిస్తూ భక్తులు జై జగన్నాథ నినాదాలతో పెద్ద మొత్తంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. సంప్రదాయ భజనలు, మంగళ వాయిద్యాలు, నృత్యాలు, భక్తుల హారతులతో భారీ సంఖ్యలో ప్రజలు రథాలను తాళ్లతో లాగారు.ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీ జగన్నాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం రథయాత్రలో భక్తులతో కలిసి రథాలను లాగుతూ స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఆదివాసి రాష్ట్ర కోఆర్డినేటర్ రఘు నాయక్, మున్సిపల్ కౌన్సిలర్ పెంటయ్య, మురళీమోహన్, సుదీర్, అశోక్, శివ, పినమోని గోపాల్, శ్రీధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భరత్ లోహాటి, తంగడపల్లి శంకర్, మాజీ జెడ్పీటీసీ సాయికృష్ణ, జయప్రకాష్, మురళి, గంగమోని సత్తయ్య, రవితేజ, భక్తులు పాల్గొన్నారు.






