- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

పర్యాటక పరంగా అభివృద్ధి చేద్దాం : ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి
బసిరెడ్డిపల్లిలో డెక్కన్ మానియా ఆధ్వర్యంలో బైక్ స్టే
దిశ, పరిగి : పరిగి నియోజకవర్గం లోని కొన్ని ప్రాముఖ్య ప్రదేశాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగి మండలం బసిరెడ్డి పల్లి గ్రామంలో శనివారం డెక్కన్ మానియా ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ స్టే ఈవెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే టి.రామోహన్ రెడ్డి బైక్ నడిపి బైక్ రైడ్ లు ప్రారంభించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి బైక్ రైడర్స్ డెక్కన్ మానియా బైక్ స్టే కార్యక్రమంలో సుమారు 350 మంది బైక్ రైడర్స్ పాల్గొన్నారు. పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి తో పాటు, డి.ఎస్.పి శ్రీనివాస్, సిఐ సామ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ మోహన్ కృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్న గారి పరశురాం రెడ్డి, కే హనుమంతు ముదిరాజ్ వివిధ బైక్ రైడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు.






