- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ నిర్మాణాలకు నేతల అండ!
కొందరు నాయకులు అక్రమార్కులకు, అధికారులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సందెట్లో సడేమియా అన్న చందంగా అందిన కాడి కి జేబుల్లో వేసుకుంటున్నారనే విమర్శలు ఉ న్నా యి.

దిశ, గండిపేట : ప్రజా ప్రతినిధులు.. నాయకులు ఒకప్పుడు అధికారులకు ప్రజలకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతుండేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. కొందరు నాయకులు అక్రమార్కులకు, అధికారులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సందెట్లో సడేమియా అన్న చందంగా అందిన కాడికి జేబుల్లో వేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు అక్రమ నిర్మాణాలు, అనుమతులేని నిర్మాణాల విషయంలో వెన్నుదన్నుగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినబడుతుంది. ముఖ్యంగా గండిపేట మండ ల పరిధిలో ఈ వ్యవహారం ఎక్కువగా కనిపిస్తుందని తెలుస్తుంది. కొందరు నాయకులు, లీడర్లు ప్రజా సమస్యలను విస్మరించి సొంత కార్యాలను, జేబులు నిండే వ్యవహారాలను చక్కబెడుతున్నారనే విమ ర్శలు వినిపిస్తున్నాయి.
ఏసీబీ దాడులతో అధికారుల వెనుకడుగు..
ఇటీవల ఏసీబీ దాడులు తీవ్రతరం కావడంతో అధికారులు ప్రత్యక్ష వ్యవహారాల్లో తల దూర్చడం లేదు. ఏమాత్రం రిస్కు తీసుకోకుండా వచ్చిన కొద్ది పాటి డబ్బులను దర్జాగా జేబులలో నింపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏసీబీ దాడులు కొన్ని రోజులుగా తీవ్రం కావడంతో కొందరు నాయకులను మధ్యవర్తులుగా నియమించుకుంటున్నారని తెలిసింది. ప్రస్తుతం గండిపేట మండల పరిధిలోని రాజేంద్రనగర్ సర్కిల్, నార్సింగి సర్కిల్ కొనసాగుతున్నాయి. పూర్వపు నార్సింగి మున్సిపాలిటీ, ప్రస్తుత నార్సింగి సర్కిల్ పరిధిలో చాలా ప్రాంతం 111 జీవో పరిధిలో ఉంది. ఇక్కడ నిబంధనల ప్రకారం ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. ఇది మున్సిపల్ అధికారులతో పాటు కొందరు నాయకులకు కల్పతరువుగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా రంగారెడ్డి జిల్లాతో పాటు శివారు ప్రాంతాలలో ఏసీబీ దాడులు ము మ్మరం కావడంతో మున్సిపల్ అధికారులు జంకుతున్నారు. నేరుగా అక్రమార్కుల నుంచి డబ్బులు తీసుకునేందుకు భయపడుతున్న యంత్రాంగం స్థానిక మాజీ ప్రజాప్రతినిధులతో పాటు కొందరు నాయకులను మధ్యవర్తులుగా నియమించుకుంటున్నారని తెలిసింది. ఆయా ప్రాంతాలలో వారిని మధ్యవర్తులుగా చేసుకొని అక్రమార్కుల నుంచి భా రీగా డబ్బులు లాగుతున్నట్లు తెలుస్తోంది. అక్రమ నిర్మాణదారులు, 111 జీవో పరిధిలో భారీగా నిర్మాణాలు చేపడుతున్న వారు కొందరు లీడర్లను ఆశ్రయిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ నిర్మాణాలకు ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకోవాలని వారిని ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. దీనిని అలుసుగా తీసుకున్న కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు అక్రమ నిర్మాణదారులు, అధికారులకు మ ధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తూ వ్యవహారాలను చక్కదిద్దుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణదారుల నుంచి భారీగా డ బ్బులు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచా రం. అందులో కొంత భాగాన్ని అధికారులకు ము ట్ట చెబుతున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ దాడుల విష యంలో జంకుతున్న అధికారులు నేరుగా డబ్బులు తీసుకునేందుకు జంకుతూ కొందరు నాయకుల ద్వారా జేబులు నింపుకుంటున్నారని తెలిసింది.
అడ్డగోలుగా నిర్మాణాలు..
నార్సింగి సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో అక్ర మ నిర్మాణాలు, 111 జీవో పరిధిలో నిబంధనలకు తూట్లు పొడుస్తూ వందల కొలది అక్రమ నిర్మాణా లు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి. ఎప్పటికప్పు డు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ కఠిన చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవ డం లేదనేని, అందినకాడికి దండుకుంటూ అక్ర మ ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నజర్ వేయాలి..
అక్రమ నిర్మాణాల విషయంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. గతంలో మున్సిపాలిటీ ఉన్న సమయంలో కూడా సీడీఎం ఏ అధికారులు కళ్లు మూసుకొని వ్యవహరించారనే విమర్శలు లేకపోలేదు. స్థానిక అధికారులు వారిని మేనేజ్ చేయడంతో అంతా బాగుంది అనే వ్యవహా ర శైలితో ని ర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తుం ది. ఇప్పటికైనా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్ష ణ చేస్తూ అక్ర మాల విషయంలో కఠినం గా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






