- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచే కార్యక్రమం
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచే గొప్ప కార్యక్రమాన్ని ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు.

దిశ, ఇబ్రహీంపట్నం : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచే గొప్ప కార్యక్రమాన్ని ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రజా భవన్ లో శుక్రవారం అయన మంచాల మండలానికి చెందిన 53 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల చెక్కులను ఆయన లబ్ధిదారులకు చెక్కులను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కేవలం ఆర్థిక సాయానికే పరిమితం కాదని, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచే గొప్ప కార్యక్రమాలని అభివర్ణించారు. ఆడబిడ్డల వివాహాలు అప్పుల బాధలు లేకుండా, ఆనందోత్సాహాల నడుమ జరగాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుకు రూ. 1లక్ష 116 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సాయంతో పెళ్లి ఖర్చుల భారం తగ్గిందని పలువురు లబ్ధిదారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచాల మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.






