ఏకగ్రీవాలు అంతంత మాత్రమే.. ఫండ్స్ రాక నిరాశ.. వికారాబాద్‌లో తగ్గిన జోరు!

by Ramesh Naini |

ప్రాంతీయ ప్రతినిధులు సర్పంచి ఎన్నికను ఏకగ్రీవం చేస్తే ప్రభుత్వ పరంగా రూ. 10 లక్షలు, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 5 లక్షలు మొత్తంగా రూ. 15 లక్షలు చెల్లిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది.

ఏకగ్రీవాలు అంతంత మాత్రమే.. ఫండ్స్ రాక నిరాశ.. వికారాబాద్‌లో తగ్గిన జోరు!
X

దిశ, తాండూరు: ప్రాంతీయ ప్రతినిధులు సర్పంచి ఎన్నికను ఏకగ్రీవం చేస్తే ప్రభుత్వ పరంగా రూ. 10 లక్షలు, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 5 లక్షలు మొత్తంగా రూ. 15 లక్షలు చెల్లిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 2019లో వికారాబాద్‌ జిల్లాలో మొత్తం 566 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 2019, జనవరిలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో 75 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. పరిగి నియోజకవర్గం పరిధిలో 23, కొడంగల్‌ నియోజకవర్గంలో 19, వికారాబాద్‌ నియోజకవర్గంలో 18, తాండూరు నియోజకవర్గంలో 15 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఒక్కో పంచాయతీకి రూ. 10 లక్షలు ప్రభుత్వ నుంచి ప్రోత్సాహకాన్ని రూపంలో మొత్తం 36 పంచాయతీలకు రూ. 7.50 కోట్లు, అలాగే ఎమ్మెల్యేల నిధుల నుంచి రూ. 5 లక్షల వంతున మరో రూ. 3.75 కోట్లు ఏకగ్రీవ పంచాయతీలకు అందాల్సి ఉంది. దీంతో ఏకగ్రీవ పంచాయతీలకు నిరాశ మిగిలింది.

నజరానా ప్రకటిస్తుందా? లేదా?

గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహకంగా రూ. 10 లక్షల చొప్పున నజారానా అందిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం జనానికి ఆశ పెట్టింది. దీంతో ఆ ఫండ్స్ వస్తే గ్రామంలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చనే ఆశతో యూత్, మహిళలు, గ్రామ పెద్దలు కలిసి వికారాబాద్ జిల్లాలో మొత్తం 36 పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నారు.కానీ 2019లో ఏ పంచాయతీకి పైసా నిధులు ఇంకా ఇవ్వలేదు. దీంతో ఈసారి ప్రభుత్వం ఏకగ్రీవాలకు నజరానా ప్రకటిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఏకగ్రీవ మాటేది..?

స్థానిక ఎన్నికల కోసం ఆశావాహులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన విషయం తెలిసిందే. వికారాబాద్ జిల్లాలోని 20 మండలాలలో 594 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో 257 జనరల్ సర్పంచ్ స్థానాలను నిర్ణయించారు. ఇందులో మహిళలకు 124 స్థానాలు రిజర్వ్ చేయగా, జనరల్ 133 గా నిర్ణయించారు. ఇక బీసీ వర్గాలకు 107 సర్పంచ్ స్థానాలను కేటాయించారు. అందులో బీసీ మహిళ 49, బీసీ జనరల్ స్థానాలు 58 గా నిర్ణయించారు. ఎస్సీ వర్గానికి 111 సర్పంచ్ స్థానాలు కేటాయించగా, అందులో ఎస్సీ మహిళ 51, ఎస్సీ జనరల్ 60 స్థానాలుగా నిర్ణయించారు. ఇక గిరిజన తండాల గ్రామ పంచాయతీలలో 92 గ్రామ పంచాయతీ సర్పంచుల స్థానాలను కేటాయించగా, అందులో ఎస్టీ మహిళా 47, ఎస్టీ జనరల్ 45 స్థానాలుగా నిర్ణయించారు. ఇవే కాక నాన్ షెడ్యూల్ గ్రామ పంచాయతీల్లో కూడా ఎస్టీ కులానికి చెందినవారికి 27 సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. అందు లో ఎస్టీ మహిళా 7, ఎస్టీ జనరల్ 20 స్థానాలుగా నిర్ణయించారు. అత్యధిక స్థానాలు ఏఎస్టీ, ఏస్సీ, బీసీలకు కేటాయించారు. కానీ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ శాతం ఏకులాలవారే ఉంటారు.

ప్రస్తుతం గ్రామాల్లో ఏకగ్రీవం అనే మాటే లేదు.! దీంతో ఈ సారి ఏకగ్రీవాలు ఉంటాయా..? లేదా..? అనేది తెలియాలంటే వేచి చూడాలి. సర్పంచ్ స్థానాలకు 162,వార్డు స్థానాలకు 87 వికారాబాద్ జిల్లా తాండూరు, కొడంగల్ నియోజకవర్గాలలో పంచాయతీ ఎ న్నికలకు నామమాత్రంగానే నామినేషన్లు దాఖలయ్యాయి. 262 గ్రామ పంచాయతీ లు, వార్డు 2,198 స్థానాలకు 162 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించగా, 87 మంది వార్డు సభ్యులుగా నామినేషన్‌లు దాఖలు చేశారు.

Next Story